Breaking News

2023 నాటికి లక్షా 8వేల 553కోట్లతో పేదలందరికీ 28లక్షల 30వేల ఇళ్ళ నిర్మాణం…

-మొదటి దశలో 15లక్షల 60వేలు,రెండవ దశలో 12లక్షల 70వేల ఇళ్ళ నిర్మాణం
-ఇళ్ళ నిర్మాణ కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలకే 34వేల 109 కోట్లు ఖర్చు
-23వేల 500కోట్లతో 68వేల 677 ఎకరాలు సేకరించి ఇళ్ళ స్థలాలుగా పంపిణీ
-ప్రతి లేఅవుట్ కు మండల స్థాయి,నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారి ఇన్చార్జి
-వందేళ్ళ వరకూ నిలిచేలా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం
-రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్ శ్రీరంగనాధరాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా 2023 నాటికి సుమారు లక్షా 8వేల 553కోట్ల రూ.ల వ్యయంతో 28లక్షల 30వేల 227 మందికి ఇళ్ళు నిర్మించి ఇవ్వనున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకూరి శ్రీరంగనాధ రాజు వెల్లడించారు.గురువారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి దశ కింద ఇప్పటికే 15లక్షల 60వేల 227 గృహాల నిర్మాణం చేపట్టగా అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని రెండో దశలో మరో 12లక్షల 70వేల ఇళ్ళ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.ఇళ్ళ నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వందేళ్ళ వరకూ నిలిచి ఉండేలా నిర్మించి ఇవ్వడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.ఈఇళ్ళ నిర్మాణాల కాలనీల్లో 1200 కోట్ల రూ.ల వ్యయంతో తాగునీటి వసతిని కల్పించడంతో పాటు 32వేల 909 కోట్లతో రహదార్లు,విద్యుత్,డ్రైనేజి వంటి శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.ఇళ్ళ నిర్మాణాలకై 30లక్షల ఇళ్ళ స్థలాలను పంపిణీ చేయగా 23వేల 500 కోట్ల రూ.లు వెచ్చించి 68వేల 677 ఎకరాల భూమిని సేకరించి అందించడం జరిగిందన్నారు. ఇళ్ళ నిర్మాణ పధకాన్ని పర్యవేక్షించి వేగవతంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ఒక సంయుక్త కలక్టర్ను ఇన్చార్జిగా పెట్టడం జరిగిందని మంత్రి శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు.అలాగే ప్రతి లేఅవుట్ కు ఒక మండల స్థాయి అధికారిని,ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్చార్జిగా పెట్టామని తెలిపారు.అలాగే ప్రతి నియోజకవర్గ ఎంఎల్ఏ వారి పరిధిలోని ఇళ్ళ నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు.ప్రతి ఇంటి యూనిట్ విలువ లక్షా 80వేల రూ.లు కాగా లబ్దిదారులకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుండగా స్థానిక ఎంఎల్ఏలు,ఇతర అధికారులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపి సిమ్మెంట్,ఇనుము,మెటల్,తదితర మెటీరియల్ మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆగష్టు 7వతేదీ లోగా నియోజకవర్గం,డివిజన్ స్థాయిలో సమావేశాలు జరిపి ఇళ్ళ నిర్మాణాల్లో ఎదురవుతన్న సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి శ్రీరంగనాధ రాజు చెప్పారు.ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతున్ననేపధ్యంలో ప్రజలకు వివిధ రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రభుత్వం పెద్దఎత్తున గృహనిర్మాణాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు అనవసరంగా వ్యతిరేక ప్రచారం చేయడం సమంజసం కాదని ఏమైనా నిర్మాణాత్మక సూచనలు,సలహాలు ఇస్తే ప్రభుత్వం వాటిని పరిణనలోకి తీసుకుని వివిధ పధకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తుందని హితవు పలికారు. ఈ సమావేశంలో విప్ లు క్రాపు రామచంద్రా రెడ్డి,సామినేని ఉదయ భాను,రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షులు డి.దొరబాబు,పొన్నూరు ఎంఎల్ఏ కిలారి.రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

ముఖ్యమంత్రి హామీని తక్షణమే అమలు చేసిన జిల్లా కలెక్టర్…..

-బాధిత కుటుంబం కళ్లల్లో ఆనందం…. -ముఖ్యమంత్రి హామీ మేరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 3 సం. పాపకు రూ 2 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *