విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13 వ డివిజన్ కి చెందిన కోక్కిలగడ్డ నాగేశ్వరమ్మ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు కాగా శుక్రవారం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారికి అనుమతి మంజూరు పత్రం (L.O.C) అందజేయడం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడంతో పాటు,దాని పరిధిలోకి రాని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు అని కొనియాడారు.అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఒక్క తూర్పు నియోజకవర్గనీకె దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైనా ముఖ్యమంత్రి సహాయనిధి కావాలంటే లంచాలు ఇస్తేనే కానీ వచ్చే పరిస్థితి లేదని కానీ నేడు ఎవరికి లంచాలు ఇచ్చే పనిలేకుండా ప్రతి పధకం పారదర్శకంగా ఇంటి వద్దే అందజేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉకోటి రమేష్, కోలా ఉమ, ఉమ్మడిశెట్టి బహదూర్, గల్లా రవి, రాజ్ కమల్, శేటికం దుర్గ, చెన్ను, తిరుమల రాజ్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరచి …