-మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి...
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నాటిన మొక్కల సంరక్షణ దిశగా ఆలోచన చేసి వాటిని పెంచి పోషించే వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బుధవారం కైకలూరు పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రితం ప్రభుత్వంలా మొక్కలు నాటడం మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా ఒక ఖచ్చితమైన ప్రణాళిక మరియు ఆచరణ ఏర్పాటు చేస్తూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మొక్కల్ని పంపిణీ చేయడం వాటిని పెంచి పోషించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుత సామాజిక స్థితిలో ఆక్సిజన్ యొక్క ఆవశ్యకతను కరోనా మనకు తెలియజేసిన నేపథ్యంలో ఎక్కువ ఆక్సిజన్ ను నీడను ఇచ్చే మొక్కల్ని ఎంపిక చేసి నాటడం జరుగుతుందన్నారు.అదే విధంగా నాటిన మొక్కల్ని సంరక్షిస్తూ పెంచి పోషించడానికి ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ క్రింద పని కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఎంపిడివో వెంకటరత్నం మాట్లాడుతూ కైకలూరు మండలంలో ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమం విజయవంతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ,మాట్లాడుతూ నాటబడిన మొక్కల సంరక్షణ కు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యత తీసుకోవాలని అన్నారు.
ఏేపీవో చరణ్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అవెన్యూ ప్లాంటేషన్ క్రింద విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ల వెంబడి మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని అన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మండలానికి కేటాయించబడిన 3000 మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని అన్నారు.
మండల వై.సి.పి మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ జహీర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను విజయవంతం చెయ్యవలసిన బాధ్యత అధికారులపై..స్థానిక ప్రజలపై ఉందని అన్నారు.
కార్యక్రమంలో వ్యవసాయ ఏడీ గంగాధర్, ఫిషరీస్ ల్యాబ్ ఏడీ వర్ధన్, నాయకులు అబ్దుల్ హమీద్, భాస్కర వెంకటేశ్వరరావు,, దండే రవిప్రకాష్, నిమ్మల సాయిబాబు,,తోట మహేష్, మూడెడ్ల గౌరీ నాయుడు,,బోడిచర్ల సురేష్,కటికన రఘు, గోవింద్,పంచాయతీ కార్యదర్సులు,సెక్రటేరియట్ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.