-నిర్ణీత సమయంలోనే ప్రజాసమస్యలు పరిష్కరించాలి…
-ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలి…
-గామల్లో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి…
– కోవిడ్కట్టడికి “నోమాస్క్నోఎంట్రీ – “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్ “
-నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలి…
-ఆర్డీఓ శ్రీనుకుమార్
పెదపారుపూడి (భూషనగుళ్ల), నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏఒక్ కఅంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులనునిర్వహించాలని ఆర్డీఓ జి. శ్రీనుకుమార్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. గురువారం ఆర్డీవో శ్రీనుకుమార్ మండల అధికారులతోకలసి పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామ సచివాలన్నిఆకస్మికతనిఖీచేశారు. ఈసందర్భంగా సచివాలయ కార్యదర్శి, వివిధశాఖలకు సంబందించి ప్రభుత్వపథకాల అమలుపై పర్సన్అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్నరిజిష్టర్లు, అటెండెన్సు, మూమెంట్ రిజిష్టర్ల, బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహనను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పథకాలను సకాలంలో ప్రజలకు చేరవచేయాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను స్ధాపించిందన్నారు. సచివాలయ ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తూ శాఖా పరంగా వారు చేస్తున్న పనులను సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిదిలో గల సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సర్వీసులకు సంబందించి ఏఒక్కటీ పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలోనే సచివాలయ ఉద్యోగులుపరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టరు ప్రతినెల వారంలో రెండురోజులు సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభుత్వపథకాలు, వాటిఅర్హతలు, సచివాలయం ద్వారా అందించే సేవలు, లబ్దిదారుల వివరాలతో కూడిన బోర్డులు ప్రజలకు తెలిజేసే విధంగా ప్రదర్శించాలన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా ఆయా గ్రామకార్యదర్శులు, సంబందిత శాఖల పర్సన్ అసిస్టెంట్లు పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు సమయంలో ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వ పథకాల అమలుపై రిజిష్టర్లు నిర్వహణతో పాటు అటిండెన్స్, మూమెంట్ జిస్టర్లలను నిర్వహించాలన్నారు. సచివాలయం నందు బియాండ్యస్.యల్.ఏ పెండింగులో లేకుండాచూడాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ ప్రొగ్రాం నందు జీయోటాగింగ్ ఇవ్వవలసినదిగాఆదేశించారు. బయోమెట్రిక్ అటెండన్స్ అందరూ తప్పని సరిగా వేయవలసినదిగా ఆదేశించారు.
కోవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ప్రధాన మార్గం : ఆర్డీవో శ్రీనుకుమార్
కోరోనా కట్టిడికి వ్యాక్సినేషన్ ప్రధానమార్గమని ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా సచివాలయ పరిదిలో అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి వారం పక్కాగా ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్ళి నిర్వహించాలి.. ఆర్డీవో కోవిడ్ మూడవ దశ ప్రభలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున డివిజన్ పరిదిలో వాలెంటీర్లు, ఆశా, వైద్యసిబ్బంది ఫీవర్ సర్వే పక్కాగా ఇంటింటికీ వెళ్ళి నిర్వహించాలన్నారు. సర్వేకు వెల్లకుండా వెళ్లినట్లు నివేదకలు ఇస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాకలెక్టరు వారి ఆదేశాలు మేరకు జిల్లాలో ప్రతివారం సోమ, మంగళ, బుధవారాల్ లోకోవిడ్ కట్టడికి “నోమాస్క్నోఎంట్రీ- “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్” నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీవోవెంటతాహశీల్థార్ యంవి సత్యనారాయణ, యంపీడీవో మల్లేశ్వరి, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.