Breaking News

హోం మినిస్టర్ చేతులమీదిగా మిరాకిల్ అవార్డ్స్ అందుకున్న తెనాలి వాసులు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణానికి చెందిన దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్, డాక్టర్ కనపర్తి రాగలతలు ప్రముఖ రికార్డ్స్ నమోదు సంస్థ మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతిష్టాత్మక పురస్కారాలు మాన్ ఆఫ్ ది మిరకల్, ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డులను హోం మినిస్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరులోని హోం మినిస్టర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. పురస్కారగ్రహీతలు రత్నాకర్, డాక్టర్ రాగలతల హోం మినిస్టర్ సుచరిత అభినందించారు. ఈ సందర్భంగా మిరాకిల్ సంస్థ ప్రతినిధి తిమ్మిరి రవీంద్రబాబు మాట్లాడుతూ అద్భుతమైన సాహస ప్రదర్శన చేసినందుకు, 100 సంవత్సరాల క్రితం తెనాలి, పరిసర గ్రామాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని సజీవంగా వీరస్థలి తెనాలి అనే చిత్రాన్ని చిత్రీకరించినదుకు రత్నాకర్ కు మాన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును, కోవిడ్ సమయంలో వైద్య సేవలు, సామాజిక సేవలు అందించినందుకుంగాను డాక్టర్ రాగలత కు ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును అందజేసామన్నారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. జె. శ్యామ్, నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిమ్మిరి. భానుచందర్, న్యాయవాది కె. మధుకర్ తదితరులు  పాల్గొన్నారు.

Check Also

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన తిరుపతి రుయా ఆసుపత్రి సీఎస్ ఆర్.ఎం.ఒ డాక్టర్ బి.సుబ్బలక్ష్మమ్మ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *