కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్ఛ సంకల్పానికి గ్రామాల్లో సంపూర్ణ మద్దతు నిచ్చి గ్రామాలను సుందర ఆరామాలుగా మార్చే ప్రక్రియకు తోడ్పాటు నందించాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. సోమవారం కైకలూరు మార్కెట్ యార్డ్ రైతు కళ్యాణ మండపంలో జరిగిన కైకలూరు మండల జగనన్న స్వచ్ఛ సంకల్పం సమాయత్త సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత ను సాధించడం అనేది ఆయా గ్రామాల సర్పంచులు ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు.గ్రామ పంచాయితీ యూనిట్ గా సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం లో ఇచ్చిన 100 రోజుల ఆచరణ ప్రణాళికను చిత్తశుద్ధి తో అమలు చేసి పరిశుభ్రత తో పాటుగా జగనన్న పచ్చతోరణం క్రింద మొక్కలు నాటి పెంచి..తమ గ్రామాలను అనారోగ్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు.మార్పు అనేది వ్యక్తి నుండి మొదలైతేనే అది వ్యవస్తీ కృతం అవుతుందని తద్వారా మంచి ఆరోగ్యకరమైన సమాజం మనముందు సాక్షాత్కరిస్తుందన్నారు.ప్రతిగ్రామం లోనూ స్వాగతం బోర్డులతో పాటుగా మాస్క్ లేనివారు మాగ్రామంలో ప్రవేశానికి అనర్హులు అని బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.ప్రతిఒక్కరు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన మేరకు కార్యక్రమాన్ని నిర్వహించి మీ మీ గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఎంపీడీఓ వెంకటరత్నం మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల పాటు రోజువారీ చేపట్టవలసిన కార్యక్రమాలు వివరించిన అనంతరం తాహశీల్దార్ సాయి కృష్ణ కుమారి,ఎంపిపి అభ్యర్థి అడివికృష్ణ
సర్పంచ్ డీయం నవరత్న కుమారి సీడీపీవో ప్రసన్న విశ్వనాధ్,ఏపీవో శరణ్ తదితరులు ప్రసంగించారు. హాజరైనవారందరితో స్వచ్ఛ సంకల్ప ప్రమాణం చేయించడం జరిగింది. కార్యక్రమంలో ఈఓ పీఆర్&ఆర్డీ రవికుమార్, ఈఓ లక్ష్మీనారాయణ, ఏపీవో,టౌన్ ఎస్.ఐ షణ్ముఖ సాయి,వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్సులు,అంగన్వాడీ వర్కర్లు,గ్రామైఖ్య సంఘాల అధ్యక్షులు, బుక్ కీపర్లు, ఏఎన్ఎంలు,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Tags kikaluru
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …