Breaking News

శాప్ నెట్ ను బలో పేతం చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తాం…


-విద్య గ్రామీణాభివృద్ధి ఐటి వ్యవసాయ గ్రామ సచివాలయాల రంగాల్లో శాప్ నెట్ ద్వారా సేవలు అందిస్తాం…
-శాప్ నెట్ ద్వారా విద్యార్థులకు దూరవిద్యా సేవలు అందిస్తున్నాం…
-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాజీవన విధానంలో మెరుగైన సేవలు అందించే విధంగా శాటి లైట్ రంగంలో పొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ (శాప్ నెట్) ను బలోపేతం చేయుట ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
శాప నెట్ ఛైర్మన్‌గా నియమితులైన బాచిన కృష్ణ చైతన్య పోమవారం తాడేపల్లిలోని సియస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్ తదితరుల సమక్షంలో పదవీబాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ సమాచార సాంకేతిక వ్యవస్థ నానాటికి అభివృద్ధి చెందుతున్న తరుణంలో శాట్వెట్ ప్రాముఖ్యత ఎంతో పెరిగిందన్నారు. ప్రభుత్వం శాప్సెట్ను బలోపేతం చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా విద్య, గ్రామీణాభివృద్ధి, ఐటి, వ్యవసాయ, గ్రామ పచివాలయాల రంగాల ద్వారా ప్రజలకు
అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించి వాటిని పద్వినియోగం చేసుకునేలా శాప్నెట్ కృషి చేయాలన్నారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు పలు పథకాలను అమలు ద్వారా సుపరిపాలన అందించగలిగామని ఆయన అన్నారు. ప్రతీ కార్యకర్త జగనన్న సైనికుడిగా పనిచేయవలసిన అవసరం ఉందని అప్పుడే ప్రభుత్వం చేస్తున్న ప్రతీ కార్యక్రమం ప్రజలకు చేరగలదని ఆయన అన్నారు. హఠాత్తుగా ఎన్నికలు పెట్టినా మనం విజయం సాధించగలిగామని, అధికారంలోకి వచ్చాక అన్నీ వర్గాలకు లబ్ధి చేకూర్చేలా జవరంజకమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. జగన్మోహన రెడ్డి పరిపాలనలో ప్రతీ కార్యకర్తకూ ఆత్మగౌరవం పెరిగిందని, ప్రతీ గ్రామంలో ఏదో ఒక పదవిని చేపట్టారని ఆయన అన్నారు. రాష్ట్రంలో 135 కార్పోరేషన్ పదవులను అందించామని, కష్టపడి పనిచేసిన వారికి జగన్మోహన రెడ్డి ఎ ప్పుడూ గుర్తింపు విస్తారని ఇందుకు శాప్నెట్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బాచిన కృష్ణ చైతన్య ఉదాహరణ అని సజ్జల అన్నారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక మీరే మాకు కావాలనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణ చైతన్య నేతృత్వంలో శాప్ నెట్ మరింత బలోపేతం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా కృష్ణ చైతన్యకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాపరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యస్ సి, యటి, బిసి వర్గాలకు చెందిన వారికి 50 శాతం పదవులు కేటాయించామని ఇది ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు. శ్రమించే వారికి పదవులు వస్తాయని ఇంకనూ కష్టపడి పనిచేసేవారికి భవిష్యత్తులో పదవులు వస్తాయని అన్నారు. ప్రతి గ్రామంలోనూ శాప్నెట్ సేవలు అందేలా సంస్థను మరింత బలోపేతం చేసేలా ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన బాచిన కృష్ణ చైతన్య పనిచేస్తారనే నమ్మకం నాకున్నదని మంత్రి అన్నారు. అద్దంకి నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృష్ణ చైతన్య కృషి చేస్తారని ఇందుకు ప్రతీ కార్యకర్త పూర్తి సహకారం అందించాలని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
రాష్ట్ర విద్యాశాఖామంత్రి అది మూలపు సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజల జీవన విధానం ఆన్ లైన్ కార్యక్రమాలతో ముడిపడి ఉందన్నారు. ప్రజల అవసరాలు జీవన శైలిని మెరుగుపరిచేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసి శాప్నెట్ ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మన టివి ప్రచార సాధనం ద్వారా విద్య వైద్యం వ్యవసాయం గ్రామీణాభివృద్ధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించి దూరవిద్యా ప్రసారాలను ప్రసారం చేసేందుకు అవసరమైన బడ్జెట్ ను విద్యాశాఖ నుండి కేటాయిస్తామన్నారు. శాపటకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో మన టివిలో ఉన్న రాష్ట్రానికి చెందిన ఆస్తులపై గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభించడంతో పాటు మన టివి ప్రసారాలపై కూడా సరైన శ్రద్ధ వహించలేదన్నారు. శాప్ నెట్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కృష్ణ చైతన్య దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదిమూలపు సురేష్ అన్నారు.
సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్ (శాప్ నెట్) ఛైర్మన్ బాచిన కృష్ణ చైతన్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు అనుగుణంగా శాప్ నెట్ సంస్థను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. నాపై ఎంతో వమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి శాప్ నెట్ ఛైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా, సంస్థను మరింత అభివృద్ధి పరిచేలా ఛైర్మన్ గా నేను పనిచేస్తానని కృష్ణ చైతన్య అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, మాజీ శాసన సభ్యులు బాచిన చెంచు గరటయ్య ఆశీస్సులతో అద్దంకి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని కృష్ణ చైతన్య అన్నారు.
ఈసమావేశంలో బాపట్ల శాసన సభ్యులు నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, దర్శి ఎమ్మెల్యే యం. వేణుగోపాల్, అద్దంకి మాజీ శాసన సభ్యులు బాచిన చెంచు గరటయ్య, మాదిగ కార్పోరేషన్ చైర్మన్ కనకారావు, అద్దంకి నియోజకవర్గ నాయకులు, శాప్ నెట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *