Breaking News

రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం… : మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)

-మల్లాయిపాలెంలో రూ.21.80 లక్షలతో ఆర్‌బీకే నిర్మాణం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు అన్నివిధాలా అండగా ఉండేందుకు రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల పనితీరుపై జిల్లా కలెక్టర్ నివాస్ తో మాట్లాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కే మాధవీలత రైతు భరోసా కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై సమీక్షించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతులు కష్టపడి సాగు చేసిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం కోసం మళ్ళీ కష్టపడే పరిస్థితి రాకూడదని సీఎం జగన్మోహనరెడ్డి భావిస్తున్నారన్నారు. రైతుభరోసా కేంద్రాలకు వచ్చినపుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా ఒక వ్యవస్థను సీఎం జగన్మోహనరెడ్డి ఏర్పాటు చేశారన్నారు. ఆర్బీకేలలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లకు, రైతులకు మంచి వాతావరణం ఉంటేనే అనుకున్న ఫలితాలను సాధించగలమన్నారు. రైతులు వ్యక్తం చేసిన సందేహాలు, సలహాలను పరిష్కరించే దిశగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రయత్నించాలన్నారు. అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెల రోజుల పాటు పనిచేసేలా నిబంధనను పెట్టాలని సీఎం జగన్మోహనరెడ్డి సూచించారని, దీనివల్ల ఆర్బీకేల పనితీరు, కార్యక్రమాలపై అగ్రికల్చర్ విద్యార్థులకు అవగాహన, పరిజ్ఞానం వస్తాయని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అనంతరం మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శోభిక, డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నేతలు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మురారి నగేష్, పొడిచేటి కృష్ణ, గోవాడ చంటి, తాజుద్దీన్, గోళ్ళ రామకృష్ణ, కలపాల కిరణ్, యార్లగడ్డ మురళి, నైనవరపు శేషుబాబు, బంటుమిల్లి సూర్యనారాయణ, మేకల సత్యనారాయణ, సత్యదుర్గాప్రసాద్, పెనుమూడి రమేష్, దొండపాడు మురళి, బచ్చు మణికంఠ, గంటా శ్రీను, కొండపల్లి కుమార్ రెడ్డి, మొండ్రు వెంకటేశ్వరరావు, నగుళ్ళ సత్యనారాయణ, మాదాసు వెంకటలక్ష్మి, చుండూరి శేఖర్, అలీబేగ్, రంగా, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని తదితరులు పాల్గొన్నారు.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *