ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంనందు 3 వ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం ఉదయం 7 గం.లకు ఆర్జిత సేవ గానూ మరియు 10 గం.లకు (తెల్ల రేషన్ కార్డు దారులకు) ఉచితముగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరిగినది. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భక్తిశ్రద్ధలతో వ్రతం మహిళా భక్తులు ఆచరించారు. దేవస్థానం వారు వ్రతమును అవసరమగు పూజా వస్తువులను ఉచితంగా సమకూర్చారు. వరలక్ష్మీ దేవి వ్రతం మరియు శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయనుండటం తో భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు ఏర్పాట్లును ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ పర్యవేక్షించారు.
Tags indrakiladri
Check Also
జిల్లా అభివృద్దికి కేటాయించిన 200 కోట్ల రూపాయల పనులను జనవరి చివరి నాటికి అన్నీ పూర్తి చేయాలి
-వంద కోట్ల పనులను 70 శాతం సంక్రాంతి పండగ నాటికి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ …