పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వంశధార కాలువ ద్వారా పారుతున్న నీరు ఎగువ దిగువ ప్రాంత రైతుల సాగుకు అందేలా చూడాల్సింది పోయి. ప్రాంతాల అభిమానంతో పక్షపాత వైఖరి అవలంభిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు చేస్తున్న తీరుపై పలాస నియోజకవర్గం రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి దిగువ ప్రాంత రైతుల పొట్టకొట్టారు. సంవత్సరాలుగా కరువు ప్రాంతంగా మిగిలిపోయే విదంగా అచ్చెన్నాయుడు చేసిన నిర్వాకం టెక్కలి నియోజకవర్గం ఎగువ ప్రాంతంలో అనుమతులు లేకుండా వంశధార కాలువపై ఎత్తిపోతల ద్వారా నీటిని దొంగిలించే దొంగ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకుంటూ దిగువ ప్రాంత రైతులను ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కార్ ను కోరారు. టెక్కలి నియోజకవర్గంలో వంశధార కాలుపై ఉన్న అనధికార, అనుమతులు లేని ఎత్తిపోతలను గుర్తించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ని కోరుతున్నాము. పెద్దెత్తున అనుమతులు లేని ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించుకుని పోతున్నారని ఆవేదన చెందారు. దిగువ ప్రాంత రైతులను కరువు రైతులుగా మార్చేస్తున్న అనుమతులు లేని ఎత్తిపోతలను శాశ్వతంగా తొలగించాలని కోరారు. ఎగువ ప్రాంతంలో వాడుకలో ఉన్న ఎత్తిపోతలకు ఆయకట్టు నోటిఫై కాలేదని వాటిని గుర్తించి ఆయకట్టు నోటిఫై లేని వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. పలాస నియోజకవర్గంలోని, వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలాల రైతులు ఆయకట్టు భూములకు నీటి పన్నులు కడుతున్నారని అయినా దుగువ ప్రాంత రైతులకు రావాల్సిన నీటి వాటాను విడుదల చేయడం లేదని అన్నారు. అధికారులను బెదింపులకు పాల్పడుదుతూ అధికార దుర్వినియోగం చేస్తూ కింజరాపు అచ్చెన్నాయుడు చేస్తున్న నిర్వాకాన్ని జిల్లా కలెక్టర్ గుర్తించాలని కోరారు. దిగువ ప్రాంత రైతులకు వాస్తవంగా రావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని రైతుల వ్యవసాయానికి సాగు నీరు అందించే దిశగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఎగువ ప్రాంతంలో నాయకుల తీరువలన దిగువ ప్రాంత రైతులు భవిష్యత్తులో ఆకలి చావులు తప్ప వారికి మిగిలేది ఏమి లేదని అన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా మూడు మండలాల్లో ఒక్క చెరువు కూడా నిండలేదని. కాలీ చెరువులతో ఇప్పటికి దర్శనం ఇస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ దుగువ ప్రాంత రైతులతో తక్షణమే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల రైతుల సమస్యలు తెలుసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఎగువ ప్రాంత ఎత్తిపోతలను శాశ్వతంగా ఆపుచేయకపోతే దిగువ ప్రాంత రైతులు నీటి ఉద్యమాలు చేపట్టే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. తెలుగుదేశం నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు తమ ప్రాంత రైతులకు లబ్ధి చేకూరేలా అనుమతులు లేని ఎత్తిపోతలను పెట్టించి అధికారులపై హుకుం జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టెక్కలి నియోజకవర్గం లోని ఎగువ ప్రాంత ఎత్తిపొతలపై సమగ్రంగా దర్యాప్తు చేసి దుగువ ప్రాంత రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు ప్రాథమిక సహకార సంఘం మాజీ చైర్మన్ దువ్వాడ మధుకేశ్వరరావు, వజ్రపుకొత్తూరు మండల రైతులు పాల్గొన్నారు.
Tags palasa
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …