అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతక్కి నుండి కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును CRIF నిధుల క్రింద 14 కోట్ల రూపాయలతో విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం పాల్గొని నిర్మాణ సంస్థ సూపర్ వైజర్ చేత శిలాఫలకం ప్రాంభింపచేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ నూతక్కి నుండి వయా గుండిమెడ, ప్రాతురు గ్రామాల మీదుగా కుంచనపల్లి బైపాస్ రోడ్డు వరకు 10.5 కిలోమీటర్ల రోడ్డును 14 కోట్ల రూపాయలతో నిర్మించటానికి ఈ రోజు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి సర్వే పనులు ఒక వారం రోజులలో పూర్తి చేసి గ్రామాల వద్ద అవసరమైన చోట CC డ్రైన్లు, కాల్వర్టులు నిర్మాణం కూడా చేయటం జరుగుతుందని ఒక సంవత్సర కాలంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారన్నారు. వీలైనంత త్వరగా 1 సంవత్సరం లోపల రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను కోరారు. నూతక్కి, చిర్రావురు, గుండిమెడ, ప్రాతురు వంటి గ్రామాలలో వ్యవసాయ ఉత్పత్తులు విజయవాడ, మంగళగిరి రవాణాకు రైతులకు, ప్రజలకు చాలా అనువుగా ఉంటుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి YS జగన్మోహనరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఇందులో భాగంగా MTMC పరిధిలో మంగళగిరి పాత బస్టాండ్ వద్ద నుండి పెద్దపరిమి వరకు 25 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రస్తుతం లెవిలింగ్ పనులు జరుగుతున్నాయని అలాగే రెవేంద్రపాడు నుండి తాడేపల్లి బైపాస్ రోడ్డు కట్ట వరకు రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రాంభించటానికి రెడీగా ఉన్నారన్నారు. మొత్తంగా ఈ 3 రోడ్లు చాలా ప్రధానంగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు.
Tags vijayawada
Check Also
సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …