కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా యాజమాన్య పద్ధతుల్లో తీసుకురావాల్సిన మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం దొమ్మేరు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనము నకు మంత్రి తానేటి వనిత శంఖుస్థాపనచేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమ ప్రభుత్వ మన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను (పీఏసీఎస్) మరింత విస్తరించాలని, బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి మూడు రైతు భరోసా కేంద్రాలకు ఒక పీఏసీఎస్ చొప్పున ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ బోర్డుల్లో మూడింట ఒక వంతు డైరెక్టర్లుగా వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీ రంగాల్లో నిపుణులైన వారిని నియమించడం ద్వారా బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని తానేటి వనిత తెలిపారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయశాఖ సహాయకులను పీఏసీఎస్‌లలో సభ్యులుగా నియమించేలా చట్టసవరణకై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా యాజమాన్య పద్ధతుల్లో తీసుకురావాల్సిన మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. నాబ్కాన్స్ (నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్) చేసిన సిఫార్సులను చర్చించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలనూ అందించడం జరుగుతుందన్నారు. కోటి రూపాయల సొసైటీ నిధులతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. సొసైటీ ఛైర్మన్ గారపాటి వెంకట కృష్ణ సతీసమేతంగా పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ గారపాటి వెంకట కృష్ణ, ,సభ్యులు వాడపల్లి వెంకట సూర్యనారాయణ, వసలపూడి భూషణం, డివిజనల్ కో అపరేటివ్ ఆఫీసర్ ఏ. శ్రీనివాస్, ఎంపిడిఓ పి.జగదాంబ, సబ్ డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ పి. వెంకటేశ్వరరావు, కొవ్వూరు సి ఐ పి.సునీల్ కుమార్, డిసిసిబి కొవ్వూరు బ్రాంచ్ మేనజర్ ఎమ్. హనుమంతరావు, ఏలూరు డిసిసిబి బ్యాంక్ పర్సన్ బండి లక్ష్మి నారాయణమ్మ, కార్యదర్శి కె. ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు తోట రామకృష్ణ, , అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …