విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి అశోక్ ట్రేడర్స్ అధినేత బూర్లె నాగభూషణం రాధిక పుణ్య దంపతులు సోమవారం నాడు వెండి జటాజుటం సమర్పించారు. సుమారు రూ. 2 లక్షల విలువైన రెండున్నర కిలోల వెండి జటాజుటంను గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతులమీదుగా ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆలయ ఛైర్మన్ కొల్లూరు రామకృష్ణ, ఈవో యడ్లపల్లి సీతారామయ్య, ధర్మకర్తలు కొండా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …