-స్పందనలో 69 అర్జీల రాక…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధసమస్యల పరిష్కారానికి 69 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి. ఎస్ఎస్ ప్రవీణ్ చంద్. తెలిపారు.వీటిలో అత్యధికంగా రెవెన్యూ 23, పురపాలక 15, పోలీస్ శాఖ 3, సెర్ప్ 11, పంచాయతీరాజ్ 9, ఇతర శాఖలు 8 చొప్పున మొత్తం 69 దరఖాస్తులు అందాయన్నారు.నడిచేందుకు వీలుకాని పరిస్థితుల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతురాలైన విజయవాడకు చెందిన తిరుమల కొండ పూజిత కు వీల్ చైర్ ను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ అందించారు. ఆ పాపతో ,వారి తల్లిదండ్రులతో ఎంతో ఆప్యాయతగా మాట్లాడి పూజిత ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేశారు. అనంతరం అర్జీదారుల నుంచి వారి సమస్యలను తెలుసుకొని తగు పరిష్కార చర్యలు చేపట్టారు. విజయవాడ సత్యనారాయణ పురంకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు మల్లెల అనసూయమ్మ వినతిపత్రం ఇస్తూ పక్షవాతం వచ్చిన కారణంగా వేలిముద్రలు, కళ్ళు నమోదుకాకపోవడంతో ఆధార్ కార్డు రావడం లేదని ఈ సమస్య నుంచి తనను బయటపడేసి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.ఈ విషయంపైసానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ యుసిడి పిడి కి సబ్ కలెక్టర్ సూచించారు.ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి కి చెందిన రైతు తమ పొలం వివాదంపై అర్జీ ఇచ్చారు దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఈ వివాదం కు తలెత్తిన కారణాలను విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవడం తోపాటు నివేదిక సమర్పించలని తహసీల్దార్ ను ఆదేశించారు.కనూరుకు చెందిన పి.చంద్రకళ అర్జీ ఇస్తూ తన భర్త మే నెలలో కోవిడ్ తో మరణించారని,ఏ ఆధారం లేని తన జీవనానికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. వైఎస్ ఆర్ భీమా లో తన భర్త నమోదు అయి ఉన్న దృష్ట్యా భీమా మొత్తం వచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు సంబంధించి వివరాలు వలంటీర్ కు ఇచ్చామన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయం పై సత్వర చర్యలు తీసుకోవాలని పెనమలూరు యంపిడివోను ఆదేశించారు.కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన పగుట్ల వెంకట మహాలక్ష్మి వినతిపత్రం ఇస్తూ తన భర్త కోవిడ్ తో మరణించారని ఏ ఆధారం లేని తనకు ఏదైనా ఆర్థిక సాయం అందించాలని కోరారు.విజయవాడకు చెందిన డ్రైవర్ అనిశెట్టినాగమల్లేశ్వరరావు,బుద్దవరపు పద్మ తమకు రైస్ కార్డులు మంజు5చేయాలని అర్జీలు అందచేశారు.వీటిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ ఆయా తహసీల్దార్లకు వారి అర్హత మేరకు రైస్ కార్డులు మంజూరుకు ఆదేశించారు.కార్యక్రమంలో సబ్ కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఎస్. శ్రీనివాసరెడ్డి, పలు శాఖల డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.