Breaking News

కొవ్వూరు మండల వనరుల కేంద్రాన్ని, జెడ్పీ బాలికల పాఠశాల, ఎమ్ పిపి స్కూల్స్ ను ఆకస్మిక తనిఖీ…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రెండో దశ నాడు నేడు కింద పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యడం జరుగు తుందని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల డి. మధుసూదన్ రావు తెలిపారు. సోమవారం కొవ్వూరు మండల వనరుల కేంద్రాన్ని, జెడ్పీ బాలికల పాఠశాల, ఎమ్ పిపి స్కూల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా మధుసూదన్ రావు, మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన నాడు నేడు తొలి దశలో కొవ్వూరు డివిజన్ పరిధిలో రూ.7 కోట్ల లతో 25 స్కూల్స్ అభివృద్ధి చేశామన్నారు. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, నాడు నేడు పధకాలను సక్రమంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే పాఠశాల లో చదువు తున్న విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యా కానుక పంపిణీ చెయ్యడం జరిగిం దన్నారు. రెండో విడత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధి కి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎం. ఈ. ఓ, కెంపురత్నం ఆదేశించామన్నారు. పాఠశాల లో మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం తమ పరిశీలనలో గమనించామని, తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధించిన ఆయా పనులు చేపెట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. కొందరు విద్యార్థులు షూస్ వేసుకోకుండా రావడం గమనించామని, వెంటనే షూస్ పంపిణీ చెయ్యమని , ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా యూనిఫారం/షూస్ ధరించే స్కూల్ కి వొచ్చేలా చూడా లని ప్రధానోపాధ్యాయులు ని ఆదే శించామని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు తెలిపారు.. విద్యార్థు ల సామర్ధ్యం లో నైపుణ్యాభివృద్ది, కొంచెం వెనుకబాటుతనం గుర్తిం చానని, ఆ విషయంపై ఉపాధ్యా యులకు సూచనలు చేసినట్లు తెలిపారు. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని తరగతి గదిలో 20 మందికి పరిమితము చేస్తూ, రోజు విడిచి రోజు భోదన కి చర్యలు చేపట్టామన్నారు. కొవ్వూరు మండల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని మధుసూదన్ తెలిపారు. ఆ కేంద్రములో పంపిణీ చెయ్యాల్సిన పుస్తకాలు పై అధికారులను ప్రశ్నించామన్నారు. ఏ ఒక్క విద్యార్థికి పుస్తకాలు అందలేదన్న ఫిర్యాదు రాకుండా చూడాలని, ఏదైనా ఫిర్యాదు వస్తే, కఠినంగా వ్యవహరించాల్సిఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం. ఈ. ఓ, జె. కెంపురత్నమ్, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, ఎం. ఈ. ఓ, కార్యాల య సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *