కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ సభ్యుల నిర్ణయాలతో గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా సమిష్టి నిర్ణయాలతో ఆదర్శంగా నిలుపుదామని ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ లో అత్యవసర సమావేశానికి ఛైర్ పర్సన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ కోర్ట్ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్టర్ కి చెల్లింపు చెయ్యవలసిన సుమారు రూ.11 లక్షలు సాధారణ నిధుల నుండి చెల్లించడానికి సభలో ప్రవేశ పెట్టిన అంశాన్ని కౌన్సిల్ ఆమోదించడం జరిగిందన్నారు. సమావేశంలో భాగంగా కొవ్వూరు పురపాలక సంఘం పుష్కర గ్రాంటు కి సంబంధించిన చెల్లింపులు పే అండ్ అకౌంట్స్ అధికారి ద్వారా చెల్లింపు లకు సభ ఆమోదం తెలిపింది. ప్రజా రోగ్య విభాగం చెత్త సేకరణ కై రూ. లక్ష యాభై వేల రూపాయల, గ్రేడ్-3 పురపాలక సంఘం అభివృద్ధి కై 2020-21 షెడ్యూల్ క్యాస్ట్ కాంపోనెంట్ కింద, స్టేట్ డెవలప్మెంట్ పధకం కింద రూ.1 కోటి 28 లక్షల, షెడ్యూల్డ్ కాంపోనెంట్ కింద రూ.3 .50 లక్షల , 14వ , 15 వ ఆర్ధిక సంఘం గ్రాంటు రూపంలో చేపట్టవలసిన పనులపై సమావేశంలో చేర్చించి, కొన్ని మార్పులతో ఆమోదించడం జరిగింది. ఈ అత్యవసర సమావేశం లో కొవ్వూరు మునిసిపాలిటీ చెత్త సమస్య పైన, భవిష్యత్తు లో జరిపే చెల్లింపులు పైన, పుష్కర , తదితర చెల్లింపులు జరపవలసిన బకాయి వివరాలు సభ ముందు ఉంచాలని సభ్యులు కోరగా, తదుపరి సమావేశానికి అందచెయ్యడం జరుగుతుందని కమీషనర్ పేర్కొన్నారు. 10 అంశాలపై సమావేశంలో సభ్యులు చర్చించారు. రహదారులు, త్రాగునీరు, విద్యుత్తు బకాయిలు, తదితర అంశాలపై చర్చించి, సభ్యులు పలు సూచనలు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, వైస్ ఛైర్మన్ లు మన్నే పద్మ, గం డ్రోతూ అంజలీదేవి, కౌన్సిలర్లు కోడూరి శివరామకృష్ణ, కంఠమని రమేష్, భట్టి నాగరాజు, అక్షయపాత్ర శ్రీనివాస్, రవీంద్ర, పిల్లమర్రి మురళి కృష్ణ, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …