విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా నియమించడం జరిగింది. తన పై నమ్మకం వుంచి మరలా రెడవసారి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ నగేష్ కరియప్పలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ… భవిష్యత్తులో ఎన్.యస్.యు.ఐ. బలోపేతం చేయడానికి నావంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలపై వారి తరుపున ఏలాంటి సమస్యల పరిష్కారానికైన చొరవ చూపుతాననీ, నా పోరాటాలకు కార్యక్రమాలకు ఎళ్ళవేళల సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మరియు నగర కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడమైనదని ఎన్.యస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అన్నారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …