-మహిళల సంక్షేమo, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకములు అమలు
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ వై.ఎస్.ఆర్ ఆసరా“ 2వ విడత కార్యక్రమములో భాగంగా శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20, 21 మరియు 23వ డివిజన్లకు సంబందించి కృష్ణలంక వాసవి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 1 మరియు 26వ డివిజన్ లకు సంబందించి గుణదల ఉలవచారు కంపెనీ, వద్ద జరిగిన కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజా పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు అందజేసారు.
ఈ సందర్బంలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాదయాత్రలో మహిళకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3564 స్వయం సహయక సంఘాలలోని మహిళలకు వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.34,49,23,319/- 4 విడతలుగా సంఘం ఖాతాలో జమ చేయుట జరుగుతుందని వివరిస్తూ, రాష్ట్ర మహిళలందరి తరుపున ముఖ్యమంత్రి వర్యులు వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అదే విధంగా ఈ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమo, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకములు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు విష్ణువర్ధన్ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళ సంఘాలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను దశలవారీగా చెల్లిస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 3,415 గ్రూపులకు రూ. 29 కోట్ల 52 లక్షల 7వేల 991 రూపాయలు అందించినట్లు వివరించారు. ఒకటవ డివిజన్ కు సంబంధించి 228 డ్వాక్రా గ్రూపులకు గాను 1 కోటి 66 లక్షల 32వేల 876 రూపాయలు, 26వ డివిజన్ కు సంబంధించి 91 గ్రూపులకు గాను రూ. 70 లక్షల 27 వేల 732 రూపాయలు పొదుపు సంఘాల మహిళలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, వై.సి.పి శ్రేణులు బొప్పన భవకుమార్, నగరపాలక సంస్థ యు.సి.డి అధికారులు సిబ్బందితో పాటుగా స్వయం సహాయక సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.