విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాజాగా ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. నగరంలో జరిగిన “పల్లె గూటికి పండగొచ్చింది” తెలుగు సినిమా ప్రమోషన్ లో బాగంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రముఖ సినీ హీరో సుమన్ ను డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్, ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా గౌరవ అతిధిగా విచ్చేసిన మేదర సురేష్ కుమార్ మాట్లాడుతూ ఏపీ సీయం వైయస్ జగన్, పేర్నినాని కొత్త జీవోలో సవరించిన టికెట్ ధరల ద్వారా చలన చిత్ర రంగానికి ఎంతగానో సహాయపడ్డారన్నారు. ఇది సినిమాల పునరుద్ధరణకు దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. హీరో సుమన్ లాంటి సీనియర్ నటులు నాటి నుంచి నేటివరకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చిత్రపరిశ్రమలో అందరికీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించటం, బయ్యర్లు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పడం అభినందనీయమన్నారు. దర్శకుడు కంచరాన తిరుమలరావు, సంగీత దర్శకులు సిందు కే ప్రసాద్, శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, చిత్ర యూనిట్ కు అభినందలు తెలిపారు. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఆదరిస్తారన్నారు.
Tags vijayawada
Check Also
సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత ఏర్పాట్లు సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్ర తీర ప్రాంతాల వద్ద భద్రత …