Breaking News

రు.1.18 కోట్లతోఎదురుమొండి గ్రామంలో పీహెచ్ సిని ప్రారంభించిన మంత్రి పేర్ని, ఎం ఎల్ ఏ సింహాద్రి

– త్వరలోనే ఎదురుమొండి దీవుల్లో అంబులెన్స్ ఏర్పాటుకు మంత్రి హామీ
-యేసుపురంలో పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలి -మంత్రి పేర్ని హామీ
-అసిస్ట్ సంస్థ ద్వారా విద్యార్థులకు సైకిళ్ళు, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ

నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య నాని, సింహాద్రి రమేష్ బాబు శుక్రవారం నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో రూ 1.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణలో అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో 29 మంది పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళు, పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ గావించారు. ఎదురుమొండి దీవుల్లో గల ఎనిమిది గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించుటకు అవసరమైన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరగా, మంత్రి స్పందించి వెంటనే మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అధికారులకు ఫోన్ చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యతగ అంబులెన్స్ ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని సూచించగా అధికారులు అంగీకరించారని, ఏప్రిల్ నాటికి అంబులెన్స్ అందుబాటులోకి రాగలదని మంత్రి అన్నారు. పీహెచ్సీ భవనాల మధ్య భాగంలో ఓపెన్ స్పేస్ పై కప్పు ఏర్పాటు చేసి, మధ్యలో గార్డెనింగ్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. దీవుల్లోని పేద ప్రజలకు వైద్యులు వైద్య సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఎదురుమండిలోని పాఠశాల గతంలోనే హైస్కూల్ గా అప్గ్రేడ్ అయినప్పటికీ బైఫర్ కేషన్ అనుమతి రాలేదని ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారి మంత్రి దృష్టికి తీసుకురాగా, సోమవారం నాటికి బైఫర్ కేషన్ ఆర్డర్స్ వచ్చేలాగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఫోన్లో ఆదేశించారు. యేసు పురం గ్రామంలో 110 కుటుంబాలు ప్రభుత్వ పోరంబోకు భూమిలో నివాసం ఉంటున్నారని, వీరికి పట్టాలు మంజూరు చేయాలని, గతంలో నాచుగుంట గ్రామంలో పట్టాలు ఇచ్చిన విషయం ఎమ్మెల్యే గుర్తు చేశారు. మంత్రి స్పందించి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలతో ఫోన్లో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టాలు ఇచ్చాక వీరికి పక్కా గృహాలు మంజూరు చేయాలని గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు. గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు మంత్రికి విన్నవించగా ప్రతి రైతుకు ప్రభుత్వ మద్దతు ధర ఖచ్చితంగా పొందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలో నూరు శాతం ఈ క్రాప్ లో నమోదు చేస్తేనే సిబ్బంది పని చేసినట్లు అన్నారు. జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఆసిస్ట్ సంస్థ ద్వారా సైకిళ్ళు పంపిణీ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు వారి భవిష్యత్తు గురించి వారి ఆలోచనలు అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మీ గ్రామానికి పేరు తేవాలని సూచించారు. దీవుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రజల కష్టాలలో చేదోడు వాదోడుగా ఉంటూ assist సంస్థ చేస్తున్న సేవలను మంత్రి మనస్ఫూర్తిగా కొనియాడుతూ నా జీవితంలో మీ సేవలను మరువని, సంస్థ డైరెక్టర్ జాస్తి రంగారావు, డిప్యూటీ డైరెక్టర్ రామారావు వారి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమాలలో దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహారావు, ఎంపీపీ భోగాది రాఘవ రాణి, జెడ్ పి టి సి మోకా బుచ్చిబాబు, ఎంపీటీసీ మోకా నాగ ప్రసాద్, సర్పంచ్ కన్నా సుధా కీర్తన, డి ఎం అండ్ హెచ్ వో డాక్టర్ సుహాసిని, వైద్యాధికారులు డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ ఫాతి మున్నీసా, తాసిల్దారు విమల కుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎం ఈ ఓ రామదాస్, వైద్య సదుపాయాల సంస్థ డిఇ పి వేణుగోపాల్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 947

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *