మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ.పి.యస్.ఆర్.టి.సి విజయవాడ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పద్మావతికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు వేద మంత్రోర్చనల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్ పద్మావతిని ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఆర్.టి.సి డిపో మేనేజర్ కొక్కిలిగడ్డ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Tags mopidevi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …