Breaking News

అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చే పారదర్శక పాలన ఇదే… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఏదో రకమైన వంక పెట్టి వారికి ఆ ఫలాలు దక్కకుండా ఎలా కత్తిరించాలనే ఆలోచనతో పరిపాలన చేయగా, నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెడన పురపాలక పరిధిలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో 2 వ సచివాలయం పరిధిలోని 5. 6 వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆయన ఐదో వార్డులో చిన్న మసీదు వీధిలో అబ్దుల్ రహీం, బషీరున్నిసా, మహమ్మద్ ఖాసిం, రేష్మ బేగం, అబ్దుల్ సుభాని, సనావుల్లా, అబ్దుల్ మజీద్, అబ్దుల్ బేగ్,అబ్దుల్ గఫార్, అబ్దుల్ వజీద్, సమీవుల్లా, వహీదుల్లా, షేక్ మహబూబ్ బాషా, రహంతున్నిసా, మహమ్మద్ సుభాని, మెహ్రూనీస బేగం తదితరుల ఇంటికి మంత్రి జోగి రమేష్ వెళ్లి అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందచేసి జగనన్న ప్రభుత్వం రావడం వలన మీకు ఇన్నిన్ని ప్రయోజనాలు చేకూరడం జరుగుతుందని అలానే నియోజకవర్గాన్ని సైతం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు, 5 వ వార్డులో అంగన్వాడి కేంద్రాన్ని, ప్రాథమిక ఉర్దూ పాఠశాలను మంత్రి జోగు రమేష్ సందర్శించారు. అక్కడ చిన్నారులతో కాసేపు ముచ్చటించి అంగన్వాడీ టీచర్లు డి ఝాన్సీ రాణి, కరిమున్నిసాలతో మాట్లాడి అంగన్వాడి పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన భరోసానే ఎన్నికల మేనిఫెస్టో గా రూపొందించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలలో 98 శాతం పూర్తి చేశారని అన్నారు. జగన్‌ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ప్రజాబలంతో ఆయన హిమాలయ పర్వతమంత ఎదిగిన జగనన్న ను ఎదుర్కోలేక.. ప్రతిపక్ష నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా పలు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే అత్యధిక శాతం మంది ప్రజలు మంచి చేసే తమ వైపే ఉన్నారని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అది నిత్యం తేటతెల్లమవుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, 5 వ వార్డు కౌన్సిలర్ వైస్ ఛైర్మెన్ ఎం.డి. ఖాజా, 6 వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖయ్యం ( బాబులాల్), 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, 4 వ వార్డు కౌన్సిలర్ రెహతున్నీసా, పెడన తహసీల్దార్ పి.మధుసూదన రావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, గౌసి, రియాజ్ రెహమాన్, ఆహార సలహా కమిటీ ఛైర్మెన్ హనీఫ్ ఖాన్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు దాన భైరవ లింగం,, ఎం. డి. హఫీజ్, కో ఆప్షన్ మెంబర్లు మున్నా , వీరంకి నరసింహ స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విజేత‌ల స్ఫూర్తితో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గ‌డ్డ‌పై నుంచి ఎంద‌రో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *