-క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు జిల్లా కలెక్టర్కు వివరించిన కేంద్ర బృందం
మచిలీపట్నం, నవంబర్ 9, 2022
కేంద్ర ప్రభుత్వం చే నియమించబడిన 15వ సాధారణ సమీక్ష మిషన్ బృందం జిల్లాలో ఈనెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు పర్యటించి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలు చేయుచున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరియు వాటి నుండి లబ్ధి పొందిన లబ్ధిదారులను కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు
ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా పట్నాకర్, డాక్టర్ రష్మీ వాద్వా ,శ్రీ శుభోద్ జైస్వాల్, శ్రీమతి ప్రీతి ఉపాధ్యాయ, శ్రీ అభిషేక్ దదిచ్, డాక్టర్ అనికేట్ చౌదరి లతోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి వచ్చిన డాక్టర్ శ్రీదేవి ,డాక్టర్ సుబ్రహ్మణ్యం ,డాక్టర్ శిరీష, డాక్టర్ రమాదేవి మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి మరియు పోగ్రామ్ అధికారులు జిల్లాలోని జిల్లా కేంద్ర వైద్యశాల, ప్రాంతీయ వైద్యశాలలతో పాటు రాండంగా ఎంపిక చేసుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, పట్టణ ఆరోగ్య కేంద్రాలను, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆయా కార్యక్రమాల లబ్ధిదారులైన గర్భవతులను, బాలింతలను, చిన్నపిల్లలను, వృద్ధులను ,దీర్ఘకాలిక రోగులను స్వయంగా గృహ దర్శనములుచేసి, వారి అభిప్రాయాలను ,పొందిన సేవలను క్షేత్ర స్థాయిలో సూక్ష్మస్థాయిలో పరిశీలించి సమీక్షించి తగిన నివేదికలను రూపొందించి బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాషా గారినీ కలిసి నివేదించడం జరిగినది.
ఈ సందర్భంగా జిల్లాలోని వైద్య ఆరోగ్య సేవలు సేవా కార్యక్రమాల అమలు చాలా సంతృప్తికరంగా ఉందని, కేంద్ర బృందం కలెక్టర్కు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను ఇంకా మెరుగుగా ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళుటకు లోటుపాట్లు సరి చేసుకుని తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేయగలమని కలెక్టర్ కేంద్ర బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి గీతాబాయి జిల్లాలో అమలు చేయుచున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించి ప్రోగ్రాం అధికారులైన డాక్టర్ శర్మిష్టా, డి ఐ ఓ ,డాక్టర్ వెంకట్రావు డిటిసి ఓ, డాక్టర్ సుదర్శన్ బాబు డిపిఎమ్ఓ, డాక్టర్ విజయభారతి నోడల్ ఆఫీసర్ ,డాక్టర్ రత్నగిరి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బంది సేవలు తెలియజేశారు ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఇందిరా దేవి, డాక్టర్ జై కుమార్ తదితరులు పాల్గొన్నారు.