Breaking News

రోజ్ గార్ మేళా ద్వారా యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

-రోజ్ గార్ మేళాలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 299 మందికి నియామక పత్రాలను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 71 వేల మంది అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించే ” రోజ్ గార్ మేళా” రెండో విడత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ న్యూఢిల్లీ నుంచి ప్రారంభించారు. మొదటి విడతగా అక్టోబ‌ర్ 22 న‌ నిర్వహించిన రోజ్ గార్ మేళాలో దేశ వ్యాప్తంగా 75,000 మందికి ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేశారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్టాల అభివృద్ధి శాఖల మంత్రి  కిషన్ రెడ్డి విశాఖ పట్నం నుంచి పాల్గొన్నారు. ఎన్టీపీసీ, సింహాద్రి లో ఏర్పాటు చేసిన రోజ్ గార్ మేళాలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన సుమారు 299 మందికి కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందడుగు గా అభివర్ణించారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరూ దేశం కోసం, పేదల కోసం సేవ చేయడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ శక్తివంత దేశంగా ఎదిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. 2023 వరకు ప్రతీ నెల రోజ్ గార్ మేళా నిర్వహించి యువతను దేశాభివృద్ధిలో, దేశ సేవలో భాగస్వాములను చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీసెట్టి సత్యవతి, ఎమ్మెల్సీ మాధవ్, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు , ఎన్టీపీసీ సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

విజేత‌ల స్ఫూర్తితో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గ‌డ్డ‌పై నుంచి ఎంద‌రో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *