విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చెట్టు ఒకటైతే విత్తనం మరొకటి అవుతుందా.. అనే పోలిక ఈ తండ్రీ కొడుకులకు సరిగ్గా నప్పుతుంది. తండ్రి అడుగుజాడలలో నడవటమే కాదు తండ్రికి తగ్గ తనయుడుగా అన్నింటిలోను రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు కుమారుడు జివితేష్. సాధారణంగా తల్లిదండ్రులు పెద్ద హోదాలో ఉంటే కుమారులు ధీమాగా వ్యవహరించే ఘటనలు మనం తరచు చూస్తువుంటాం. తండ్రి ఒక ప్రఖ్యాత జిల్లాకు ఉన్నతాధికారి తల్లి మరొక జిల్లాకు ఉన్నతాధికారి, చిన్నతనం నుండి కష్టపడి వృద్ధిలోకి వచ్చిన తండ్రిని స్పూర్తిగా తీసుకుని తనదైన స్థాయిలో రాణిస్తున్నాడు ఎస్. జివితేష్. వచ్చే ఏడాది జనవరి 22న జాతీయ స్థాయి చేతివ్రాత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఒలింపియాడ్ జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు రాష్ట్రం నుండి జివితేష్ ఎంపికయ్యారు. గతంలో రాష్ట్ర స్థాయి చేతివ్రాత పోటీలలో మొదటి స్థానాన్ని సంపాదించిన జివితేష్ ఈ సారి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నాడు. విజయవాడ నగరంలోని నలంద విద్యానికేతన్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్న జివితేష్ ఒలింపియాడ్ జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు ఎంపికైనట్లు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ మెహబూబ్ హుస్సేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులలో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్, అమ్మఒడి హ్యండ్ రైటింగ్ అకాడమీ ఆలిండియా గ్రాఫాలజిస్ట్ సంస్థ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఒలింపియాడ్ జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ పోటీలలో పాల్గొనే అవకాశం ఉందని, రాష్ట్రస్థాయిలో 14 వేల మంది హాజరవ్యగా జివితేష్ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలు దేశవ్యాప్తంగా అన్‌లైన్ , ఆఫ్‌లైన్ ద్వారా జరుగుతాయని రాష్ట్ర నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని, జాతీయస్థాయి కాలిగ్రఫీ చేతివ్రాత నిపుణులు భువనచంద్ర తలిపారు. జివితేష్ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి ఒలంపియాడ్ పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …