Breaking News

రైతన్నకు విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వం అండగా వుంటుంది..

-రైతులకు సున్నా వడ్డీ పథకం ద్వారా 6 కోట్ల 63 లక్షల 17 వేల వడ్డీ రాయితీ..
-జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు 55.08 ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు విత్తనం నాటిన నాటి నుండి పంట విక్రయించుకునే వరకు ప్రతి అడుగులోను ప్రభుత్వం అండగా ఉండి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ ఇన్‌పుట్‌ సబ్సిడీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రైతుల ఖాతాలలో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే రైతులకు ప్రభుత్వం అండగా వుండి వడ్డీ రాయితీ కల్పిస్తోందన్నారు. రబీ 2020`21, ఖరీఫ్‌ 2021 సంవత్సరాలకు గాను అర్హులైన రైతుల పంట రుణాలపై వడ్డీ రాయితీ ప్రభుత్వం మంజూరు చేసి ఆయా బ్యాంకులకు జమ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీలో భాగంగా రైతుల వివరాలను ప్రదర్శించామన్నారు. జిల్లాలో 25 వేల 928 మంది రైతులకు 6 కోట్ల 63 లక్షల 17 వేల పంట రుణాల వడ్డీ రాయితీ లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలనే సంకల్పంతో నష్టపోయిన పంట కాలం లోనే పెట్టుబడి రాయితీ విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల ఇబ్రహీంపట్నం మండలంలో మినుము పెసర మొక్క జొన్న చెరకు పత్తి మొదలైన పంటలను పరిశీలించి 33 శాతం పైగా నష్టపోయిన పంటల జాబితా ప్రభుత్వానికి నివేదిక అందించగా నష్టపోయిన 674 మంది రైతులకు 55.08 లక్షలు నేరుగా వారి ఖాతాలలో పెట్టుబడి రాయితీ జమ చేయడం జరిగిందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలకు నేను ఉన్నాను అంటూ.. ఇచ్చిన హామి మేరకు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోపు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. పంట వేసి ప్రతి సారి పెట్టుబడి ఖర్చుల కోసం ఆర్థిక వడ్డీల వలలో చిక్కుకుని అల్లాడుతున్న చిన్న సన్నకారు రైతులకు వడ్డీ బారాన్ని ప్రభుత్వం తగ్గిస్తూందన్నారు. ఇ`క్రాప్‌ విధానాన్ని శాస్త్రీయ పద్దతులతో నిర్వహించి పారదర్శకతకు పెద్ద పీఠవేసి రైతుల సమక్షంలోనే నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నామన్నారు. విత్తనం నుండి పంట కొనుగోళ్ళ వరకు అన్ని విధాల రైతులకు సహకారిగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల అవసరాలను తీరుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరను చెల్లిస్తూ రైతులకు అండగా వుంటామన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్‌ బెల్లం దుర్గ, అవుతు శైలజరెడ్డి, విశ్వబ్రహ్మణ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ యం శివరామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌ తిప్పలమల్లి జమల పూర్ణమ్మ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం విజయభారతి, రైతులు పాల్గొన్నారు.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *