Breaking News

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనదే ప్రభుత్వ లక్ష్యం…

-జిల్లాలో నాల్గవ విడత రూ. 30.50 కోట్లు 37,736 మంది తల్లుల ఖాతాలలో జమ..
-జగనన్న విద్య దీవెనతో లక్ష్యాలను సాధించండి.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యకు పేదరికం అడ్డుకాకుడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అందించే పూర్తి ఫీజు రీయంబర్సుమెంట్‌ తో ప్రతీ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాల్గవ విడత జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ఫీజు రీయంబర్సుమెంట్‌ బటన్‌ నొక్కి తల్లుల ఖాతాలలో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
అనంతరం కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోను అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో నాడు`నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా పాఠశాలల రూపురేఖలనే మార్చివేయడం జరిగిందన్నారు. అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేసి ప్రాధమిక విద్య నుండే శ్రాస్త సాంకేతిక పద్దతి ద్వారా విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డురాకూడదనే దృడ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్ట పెడుతున్నారన్నారు. జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాల ద్వారా అమలు చేయడం ద్వారా పేద విద్యార్థి సైతం ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. విద్యా దీవెన పథకం ఐటిఐ, డిప్లమా, డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి సువర్ణ అవకాశం లాంటిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో చదివే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కళాశాలలో జవాబుదారితనం ఉండాలనే లక్ష్యంతో విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయంబర్సుమెంట్‌ను నేరుగా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో 211 కళాశాలలో ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, బిఇడి, అగ్రికల్చర్‌, మెడికల్‌, నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న 42,524 మంది విద్యార్థులకు నాల్గవ విడత కింద 30.50 కోట్ల రూపాయలను 37,736 మంది తల్లుల ఖాతాలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారన్నారు. తల్లుల ఖాతాలలో జమ అయిన సొమ్మును వెంటనే కళాశాలలకు చెల్లించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ ఉన్నత చదువు చదివే పేద విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఐటిఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నికల్‌ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ , మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు 20 వేల రూపాయల చొప్పున వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థుల కుటుంబాలపై ఆర్ధిక భారం పడకూడదని జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామని నాడు`నేడు పథకం కింద మౌలిక సదుపాయాలు కల్పించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఇంగ్లీష్‌ మీడియంలో బోదన ప్రవేశపెట్టామన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాద్యపడుతుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అని విద్యార్థుల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చూట్టారన్నారు. డిసెంబర్‌ మాసంలో 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడం జరుగుతుందని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ అన్నారు.
తొలుత ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని మేడ బిందు జగనన్న విద్యా దీవెన పథకంపై తన అనుభవాన్ని వివరిస్తూ తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని తన తండ్రి మేడ శివ పెయింటర్‌ వృత్తి చేస్తూ కొద్దిపాటి సంపాదనతో తనను ఉన్నత చదువు చదివించలేక తనకు వివాహం చేయడం జరిగిందన్నారు. ఉన్నత చదువు చదవాలన్న కోరిక నేరవేరకపోవడంతో జీవితంపై నిరాశ కలిగిందన్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగనన్న దీవెనతో ఉన్నత చదువును చదవగలుగుతున్నానని తెలిపింది. నాలంటి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రికి జీవిత కాలం రుణపడి ఉంటానని తెలిపింది.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ ఆవుతు శ్రీ శైలజారెడ్డి, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. కె. భాగ్యలక్ష్మి, సాంఫీుక సంక్షేమ డిప్యూటి డైరెక్టర్‌ బి. వి.విజయభారతి గిరిజన సంక్షేమ అధికారి రుక్మాంగదయ, కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *