-లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిరది: కె.ఎస్.లక్ష్మణరావు
-సెక్యూలర్ పార్టీలు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలి: కె.రామకృష్ణ
-కాశ్మీర్, రామజన్మభూమి అంశాలతో పాలకుల విధానం తెలిసింది: జల్లి విల్సన్
-హిందు అనేది బీజేపీ పేటెంట్ కాదు: తులసి రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగానికి, రాజ్యాంగ లక్ష్యాలకు ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి భారతీయుడికి ఉందని వక్తలు ఉద్ఘాటించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి, బ్లాక్‌డే (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు) సందర్భంగా రాష్ట్ర లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘లౌకికవాద పరిరక్షణ’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. వేదిక చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన విజయవాడలోని ఎంబీ.విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సును ఉద్ధేశించిన శాసన మండలి సభ్యులు కె.లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటానికి నేటి పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తుందన్నారు. కేశవానందభారతీ, ఎస్‌ఆర్.బొమ్మయ్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ లక్ష్యాలను నిర్వచించిదని గుర్తు చేశారు. సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ వ్యవస్థ, గణతంత్ర విధానాలు రాజ్యాంగ మూలసూత్రాలని చెప్పారు. సీఏఏ చట్టాలు తీసుకురావటం, 370 ఆర్టికల్ రద్దు చేయటం ద్వారా లౌకిక వాదానికి ప్రమాదం ఏర్పడిరదన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు అజీజ్ పాషా మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మహాత్మగాంధీని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, 9 ఏళ్లు జైల్లో ఉండి స్వాతంత్య్రం కోసం పోరాడిన నెహ్రూను విమర్శిస్తారని చెప్పారు. దేశంలో మైనార్టీలు ద్వితీయశ్రేణి పౌరులుగా ఉన్నారని చెప్పారు . బీజేపీ వాళ్ల వద్ద భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక లేదని కేవలం అధికారంలో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు 34శాతం ఓట్లు వచ్చాయని మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందన్నారు. ఆహార భద్రత విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు మన కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ మైనార్టీలపై దాడి చేయటం, మెజార్టీలను రెచ్చగొట్టం ద్వారా రాజకీయంగా లబ్దిపొంది అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ నాయకత్వానికి కూడా బీజేపీపై ప్రేమ, మోడిపై అభిమానం లేదన్నారు. దేశంలో 63శాతం మంది బీజేపీకి ఓట్లు వేయలేదన్నారు. లైకికవాద పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఒకే మాట మాట్లాడుతారని ఎన్నికల సమయంలో ఎవరిదారి వారే చూసుకోవటం వల్ల బీజేపీకి లబ్ది చేకూరుతుందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, సంఫ్‌ు పరివార్ శక్తులకు స్పష్టత ఉందన్నారు. ఎంఐఎం పార్టీని పోటీలో ఉంచి వ్యతిరేక ఓట్లు చీల్చటం ద్వారా అధికారంలోకి వస్తున్నారని చెప్పారు. ఆర్థిక అంశాల్లో కార్పోరేట్ల ఆస్తులు పెంచటమే లక్ష్యంగా పని చేస్తున్నాయని విమర్శించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ ఇప్పుడు కనిపించటం లేదన్నారు. రూ. 12 లక్షల కోట్లకు అధిపతి అయిన అదాని 2014 ముందు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. సెక్యూలర్ పార్టీ అయిన అమ్‌ఆద్మీ కూడా కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలని వ్యాఖ్యానించటం గమనిస్తే సెక్యూలర్ పార్టీలు కూడా ఊగిసలాటలో ఉన్నాయని స్పష్టం అవుతుందన్నారు. సెక్యూలర్ పార్టీలు ప్రజల్లో మార్పు తీసుకువచ్చి 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిరచటమే ప్రధాన ఎజెండగా ముందుకు సాగాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఫ్‌ు పరివార్ శక్తులు 1992లో బాబ్రీ మసీదు, 2002లో గోద్రా అల్లర్లు సృష్టించారని, అధికారంలోకి రావటానికి ఎంతటి రక్తపాతానికైనా తెగిస్తారని చెప్పారు. రామజన్మభూమి విషయంలో చట్టాన్ని బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. సాంకేతికతను దేశాన్ని వెనక్కు తీసుకెళ్లటానికి వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. మతం మారిన వాళ్లను కూడా దళితులుగా ఉంచుతారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు గెడ్డం పెంచుతూ మోదీ దశావతారాలను చూపిస్తారని ఎద్దేవ చేశారు. చదువు విలువ తెలియనివాళ్లును వైఎస్ ఛాన్సలర్స్‌గా నియమిస్తున్నారని చెప్పారు. గోడి మీడియా పుకార్లు సృష్టించి హిందువులను, మైనార్టీలను భయపెడుతుందని ఆందోలన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం కన్వీనర్ ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగంలోని నాలుగు స్తంభాలు బీటలు వారుతున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిరదన్నారు. సిటిజన్ చార్ట్‌తో రాజ్యాంగాన్ని కూల్చటం ప్రారంభమైయిందన్నారు. సీఏఏతో లౌకికవాదం, 50శాతం సంపద కొందరి చేతుల్లో ఉండటంతో సామ్యావాదం, ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, కోర్టు తీర్పులు, మీడియా కంట్రోల్‌తో స్వేచ్ఛను ఇలా నాలుగు స్తంభాలను కూల్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హిందు అనేది బీజేపీ పేటెంట్ కాదని వివరించారు. బీజేపీ దేశభక్తి కుహనా దేశభక్తి అని విమర్శించారు. పావురాల కథతో మతసామరస్యాన్ని వివరించారు. బీజేపీ విధానాలను తూర్పూరబడుతూ ఉత్సహభరితంగా ప్రసంగించారు. టీడీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చవేతలో ప్రజలు బాధ్యతగా లేకపోవటం వల్ల కారణం అన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న మన రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి ఇంటికి నుంచి ఒకరు బయటకు వచ్చి పోరాటం చేయాలని సూచించారు. వైసీపీ మైనార్టీ నాయకులు మునీర్ అహ్మద్ మాట్లాడుతూ జీ`20 దేశాల సదస్సు కోసం జరుగుతున్న పనుల్లో ముస్లింలపై వివక్షత కొనసాగుతుందని తెలిపారు. దేశంలోని పవర్‌ప్లాంట్‌లు అన్ని మూతపడుతున్నాయని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో ధనవంతులు దేశం వదిలి పారిపోతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ 2024 తరువాత వైషామ్యాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మతోన్మాదం తలకెత్తుకుంటే విక్షణ కోల్పోతారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ వేదికను బలోపేతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి హరనాధ్, ముస్లిం ఐక్యవేదిక నాయకులు పులి జాఫర్, హైకోర్టు ప్రముఖ న్యాయవాది అబ్దుల్ మతీన్, మైనార్టీ నాయకులు బాబా హుసేన్ తదితరులు ప్రసంగించారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. అవాజ్ రాష్ట్ర నాయకులు అప్పర్ స్వాగతం పలికారు. రాష్ట్ర కన్వీనర్ ఎం.ఎ.చిష్ట వందన సమర్పణ చేశారు.
తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజాన్యాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ బృందం అభ్యుదయ గీతాలు ఆలపించారు. వేదికపైన నాయకులు ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవనూరు మహాదేవ రచించిన ‘ ఆర్‌ఎస్‌ఎస్ లోతుపాతులు’ అనేపుస్తకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు రాజ్యాంగ పీఠిక చదివి అందరిచేత ప్రమాణం చేయించారు.