విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ పీటర్ జోసఫ్ ఆధ్వర్యంలో మంగళవారం మాల మహాసేన కమిటీ సభ్యులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ నవభారత నిర్మాణం కోసం తన కుటుంబాన్ని కూడా లెక్కచేయకుండా ఈ దేశం రూపురేఖలు మార్చిన మహా ఘనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు న్యాయవాదిగా కేంద్ర మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన మహా వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తంలో లండన్ లో ఉన్న బుక్స్ మ్యూజియంలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులకు ప్రవేశం కలిగినది ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరి అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువతరం ముందుకు సాగాలని మాలాంటి యువకులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు వాళ్ళ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాల మహాసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు లెనిన్ బాబు యువజన విభాగ అధ్యక్షులు బండి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …