Breaking News

అర్హులను ఓటర్లుగా చేర్పించాలని అధికారులకు పలు ఆదేశాలు…

-కమీషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్.ఎస్.ఆర్) -2023 లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక సమ్మేళనం 07.12.2022 న జరిగింది. విజయవాడ 97వ సచివాలయం పిడబ్ల్యుడి గ్రౌండ్స్, సూర్యారావుపేట, మహేశ్వరి రెసిడెన్సీ, డోర్నకల్ రోడ్, పోలింగ్ బూత్ నం.155 లను ఎన్నికల నమోదు అధికారి-80 సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, ఏఈఆర్వో, తహశీల్దార్, సెంట్రల్ ఎలక్షన్ సెల్ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్, తో కలిసి సందర్శించినారు మరియు పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ స్టేషన్ నెంబర్ తప్పని సరిగా చూపించాలని, ప్రతి బి. యల్. ఓ వారికి సంబందించిన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల రేషియోని తప్పినసరిగా తెలుసుకోవాలని లొకేషన్ మ్యాప్ ని తప్పనిసరిగా వారివద్ద ఉండవలెనని ప్రతి బూత్ లెవల్ అధికారికి 20 మంది కొత్త ఓటర్లను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని 18-19 సంవత్సరముల వయస్సు వారిని కొత్త వోటర్లుగా నమోదు చేయవలసినదిగా సూచించారు. అర్హత తేదీ 1.1.2023 నాటికి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నందు అవసరమైన సవరణలు చేయుటకు ఎలక్షన్ కమీషను వారు కల్పించిన ఈ సదుపాయమును ప్రజలు తప్పక వినియోగించుకొనవలసినది. ఒక పరిపూర్ణమైన ఓటర్ల జాబితా ను తయారు చేయుటకు గాను ఎలక్షన్ కమీషను వారిచే ఏర్పాటు చేయబడిన ఈ ప్రక్రియలో భాగంగా పౌరులందరూ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023 నందు తప్పక పాల్గొనవలసినదిగా కోరడమైనది.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *