విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలను జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించే వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ఆర్జీదారుడు ఇచ్చిన వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ పరంగా 70 నుండి 75 శాతం వినతులు ఎక్కువగా నమోదు అవుతున్న దృష్ట్యా డివిజన్, మండల సచివాలయ స్థాయిలో వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. సమస్యను పరిష్కరించిన వెంటనే అర్జీదారుని ఫోటో అప్‌లోడ్ చేయాలన్నారు. ఆర్జీదార్లల నుండి వినతులను స్వీకరించి ప్రతీ అర్జీని అన్‌లైన్‌లో నమోదు చేసి రశీదు ఇవ్వాలన్నారు. అధికారులు ఆర్జీదారుని వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్య గుర్తించి త్వరితగతిన పరిష్కారం చూపినప్పుడే న్యాయం చేసినవారవుతామన్నారు. నాణ్యతతో అర్జీలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా డివిజనల్, మండల స్థాయి అధికారులతో వర్చువల్‌గా సంప్రదిస్తూ సంబంధిత అర్జీని అక్కడికక్కడే పరిష్కరించడంతో అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గడువులోగా పరిష్కరించాల్సిన అర్జీలకు పరిష్కారం చూపుతున్నామన్నారు.రీ ఒపెన్ అవుతున్న అర్జీలకు సంబంధించి ప్రతీ శనివారం సంబంధిత అర్జీదారులు, అధికారులతో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తూ పరిష్కరిస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
స్పందనలో 85 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22, పోలీస్ 14, యండియు 10, విద్య 9, వైద్య 5, సర్వే అండ్ సెటిల్ మెంట్ 5, ఎంప్లాయిమెంట్ 5, పంచాయతీరాజ్ 4, వ్యవసాయం 3, ఆర్‌బడ్ల్యుఎస్ 2, రిజిస్ట్రెషన్ అండ్ స్టాంప్స్ 2, సాంఫీుక సంక్షేమ, డిఆర్‌డిఏ, డ్వామా, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్ కమిషనర్లతో వర్చువల్‌గా పరిష్కారమయ్యే వినతులను జిల్లా కలెక్టర్ డిల్లీరావు అక్కడికక్కడే పరిష్కరించారు.
కార్యక్రమంలో డ్వామా పీడి జె సునీత, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడి శ్రీదేవి, మార్కెటింగ్ డిడి దివాకర్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం విజయభారతి, డియంహెచ్‌వో డా.యం సుహాసిని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …