-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ నందలి ఎక్సెల్ ప్లాంట్ ను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి సోమవారం ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ప్లాంట్ లో నూతనంగా రెండు ఎంట్రన్స్ గేట్లను ఏర్పాటు చేయాలని, ఎంట్రన్స్ గేట్ల నుండి వేబ్రిడ్జి వరకు రోడ్డును వేయాలని అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ప్లాంట్ ఆవరణలో ఎక్కడెక్కడ ఎమ్యేమి వస్తాయో మార్కింగ్ చేసి చూపించామని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. అదే విధంగా ఎక్సెల్ ప్లాంట్ లో ఉన్న ఐకానిక్ పార్కులో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.