Breaking News

ప్రణాళిక బద్దంగా చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిలబస్‌లోని అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక బద్దంగా చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు. స్థానిక లెనిన్‌ సెంటర్లోని బాబు జగజ్జీవన్‌రావ్‌, డా. బి. ఆర్‌ అంబేద్కర్‌ భవన్‌లోని ఏపీ స్టడీ సర్కిల్‌లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ పరీక్షలకు పోటీ పరీక్షలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ ఉంటుందని, పోస్టులు తక్కువగా వుండి పోటీపడే అభ్యర్థులు ఎక్కువగా ఉంటారన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు ముందుగా సిలబస్‌ను అర్థం చేసుకోవాలన్నారు. సిలబస్‌లోని ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలన్నారు. గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన పాత ప్రశ్న పత్రాలను ఎనాలసిస్‌ చేసుకుని ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు కేటాయిస్తున్నారో గమనించి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి రోజు ప్రధాన దినపత్రికలను చదివి కరెంట్‌ ఆఫైర్స్‌ పై పట్టు సాధించాలన్నారు. చదివిన వాటిని గుర్తు పెట్టుకొని ఒకటికి రెండు సార్లు పున:శ్చరణ చేసుకోవాలన్నారు. రోజులో ఎన్ని గంటలు చదివామనేది ముఖ్యం కాదని తక్కువ సమయంలో లాజిక్‌గా చదివి అర్థం చేసుకొన్నప్పుడే పోటీ పరీక్షలో విజేతలుగా నిలుస్తారని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచే విధంగా మెలకువలు, పరీక్ష విధానం, కరెంట్‌ అపైర్స్‌ను ఏవిధంగా గుర్తుంచుకోవాలి, సబ్జెక్టులను సులువుగా అర్థం చేసుకునే విధంగా కలెక్టర్‌ అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సాంఫీుక సంక్షేమ శాఖ జిల్లా అధికారి బి.వి విజయభారతి, బీసి సంక్షేమ శాఖ జిల్లా అధికారి లక్ష్మిదుర్గ, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి యం రుక్మాంగదయ్య, జిల్లా ఉపాధికల్పనా శాఖ అధికారి డా.పివి రమేష్‌కుమార్‌, శిక్షణ అభ్యర్థులు ఉన్నారు.

Check Also

విజేత‌ల స్ఫూర్తితో ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాలి

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు గ‌డ్డ‌పై నుంచి ఎంద‌రో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *