Breaking News

‘‘జగనన్న తోడు’’ తో చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా

-20,465 మందికి 57 లక్షల 06 వేల 053 రూపాయల ఆర్థిక సాయం
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు తో చిరువ్యాపారులు ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంలో భాగంగా జిల్లాలో 25,465 మంది చిరువ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి 57 లక్షల 06 వేల 053 రూపాయల వడ్డీని లబ్దిదారుల ఖాతాలో జమ చేసి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా రాష్ట్రంలోని లబ్దిదారులకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి లబ్దిదారుల ఖాతాలకు బటన్‌ నొక్కి వడ్డీ మొత్తాన్ని జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుండి అధికారులు, లబ్దిదారులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన అనంతరం జిల్లాకు చెందిన లబ్దిదారుల ఆర్థిక సహాయ చెక్‌ను కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అందజేశారు.అనంతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ‘‘జగనన్న తోడు’’ పథకం చిరువ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారి ఉపాధికి వరం లాంటిదన్నారు. వ్యాపారం నిమిత్తం ప్రైవేట్‌ వ్యక్తుల నుండి అధిక వడ్డీలకు రోజు వారిగా వడ్డీలకు అప్పు చేసి వాటిని తిరిగి చెల్లించలేక మనోవేదనకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. చిరువ్యాపారులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీకు నేను ఉన్నాను అంటూ జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకుల నుండి బుణ సహాయం కల్పించారన్నారు. బ్యాంకుల నుండి చిరు వ్యాపారులు తీసుకున్న బుణానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జగనన్న తోడుతో చిరావ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తిదారుల కళ్ళలో ఆనందం చూడగలుగుతున్నామన్నారు. జిల్లాలో చిరు వ్యాపారస్తులను గుర్తించి వారికి బ్యాంకుల నుండి బుణాన్ని అందించేందుకు ప్రత్యేక డైవ్‌ చేపట్టి చిరు వ్యాపారుస్తులను గుర్తించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు నమోదు కాని వారు గ్రామ వార్డు వాలంటీర్లను సంప్రదించి సంబంధిత సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ అన్నారు. వ్యాపారస్తులు జగనన్న తోడు పథకం ద్వారా తీసుకున్న ఆర్థిక సాయాన్ని సకాలంలో బ్యాంకులకు చెల్లించి తిరిగి ఆర్థిక సహాయాన్ని పొందాలని కలెక్టర్‌ కోరారు.జిల్లాలో ఇప్పటివరకు 46,618 మంది లబ్దిదారులకు 46.62 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.కార్యక్రమంలో ఏపి స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి. గౌతమ్‌రెడ్డి, డిప్యూటి మేయర్‌ అవుతూ శైలజారెడ్డి, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌, ఎల్‌డియం పి. కోటేశ్వరరావు, మెప్మా పిడీ ఎస్‌ ఎన్‌ విశాలాక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి కె. అనురాధ, లబ్దిదారులు పాల్గొన్నారు.

Check Also

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *