Breaking News

ఇళ్ల సమస్యలపై చారిత్రాత్మక ఉద్యమం…

-జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్దిదారుల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్లాలి
-ఫిబ్రవరి 22న మహాధర్నాకు వేలాదిగా తరలిరావాలి
-విశాఖ ఉక్కుపై కార్మిక మహాగర్జనకు మద్దతుగా దీక్షలు
-విద్యార్థి, యువజనుల బస్సు యాత్రకు సంఫీుభావం
-జీవో`1 వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో న్యాయపోరాటం
-రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం మరో చారిత్రాత్మక ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు, ఇందులో పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ`ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న కాలనీలోని నిర్మించే ప్రతి ఇంటికీ రూ.5లక్షల చొప్పున కేటాయించాలని, టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17వ తేదీ నుంచి లబ్దిదారుల సమావేశాలను ప్రారంభించామన్నారు. ఆయా ఇళ్ల సమస్యలపై లబ్దిదారుల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్లి, కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ చేపట్టి చైతన్యవంతుల్ని చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం వర్చువల్‌ ద్వారా నిర్వహించారు. దీనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్‌ (మాజీ ఎమ్మెల్సీ) అధ్యక్షత వహించారు. విజయవాడ చంద్రంబిల్డింగ్‌ నుంచి రామకృష్ణతోపాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, పి.హరినాథ్‌రెడ్డి, కేవీవీ ప్రసాద్‌, విశాఖ నుంచి సీపీఐ సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి, గుంటూరు నుంచి జంగాల అజయ్‌కుమార్‌, కర్నూలు నుంచి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులతోపాటు జిల్లా పార్టీ కార్యదర్శులు, పట్టణ/నగర కార్యదర్శులు పాల్గొని, పార్టీ పిలుపునిచ్చిన అంశాలపై చర్చించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఇళ్ల సమస్యలపై ఫిబ్రవరి 22న విజయవాడలో జరిగే మహాధర్నాకు ప్రతి జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చేలా పార్టీ శ్రేణులు నిమగ్నమవ్వాలని చెప్పారు. జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల సమస్యలపైన, విశాఖ ప్లాంట్‌ ఉద్యమం, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బస్సు యాత్రకు మద్దతు తదితర అంశాలపై వివరించారు.
సీపీఐ`ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జగనన్న కాలనీలోని ఇళ్ల సమస్యలు, టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు కేటాయించాలనే అంశంపై ప్రతిష్టాత్మకంగా ఉద్యమం చేపట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో లబ్దిదారుల వద్దకు వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. లబ్దిదారుల ఇళ్లకు రూ.5లక్షలు ఇవ్వాలని, ఇసుక, సిమెంట్‌ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కేటాయింపులో జగన్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 80వేల టిడ్కో ఇళ్లు నిర్మించి ఉన్నాయని, వాటికి అన్ని సౌకర్యాలు కల్పించి లబ్దిదారులకు అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల సమస్యలపై పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో లబ్దిదారుల వద్దకు వెళ్లాలని, వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. వారందరికీ మన డిమాండ్లతో కూడిన కరపత్రాలు ఇవ్వాలన్నారు. ఈనెల 30వరకు అన్ని నగర, పట్టణ, మండలాల్లో పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు పనిచేయాలని, ఈ ఉద్యమంలో విజయవంతమవుతామన్నారు. విజయవాడలో ఈనెల 22న తలపెట్టిన మహాధర్నాకు అన్ని జిల్లాల నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు. కనీసం జిల్లాలకు 1000మందికి తగ్గకుండా ఉండాలన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 30వ తేదీన విశాఖలో వేలాది మందితో కార్మిక మహాగర్జన జరగనుందని, దీనిని విజయవంతం చేయాలన్నారు. ఈ గర్జనకు మద్దతుగా సీపీఐ`ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో ఆర్డీవో కార్యాలయాల ఎదుట, 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ శ్రేణులు దీక్షలకు దిగాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజలందరి మనస్సుల్లో భాగస్వామ్యం ఉందని, ఆ దిశగా ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 4వరకు బస్సు యాత్ర చేయనున్నారని, దానికి పార్టీ తరపున సంఫీుభావం తెలపాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతాల్లోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల స్థితిగతులపై సీపీఐ పర్యటించనుందనీ, దీనిపై త్వరలో రూట్‌మ్యాప్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెలాఖరులోగా సీపీఐ పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేయాలన్నారు. జీవో నంబరు`1ను రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మాకంగా జారీజేసిందని, ఇది ఉద్యమ కారులమైన వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలకు పూర్తి స్థాయి ఆటంకం కలుగుతుందని రామకృష్ణ చెప్పారు. విద్యార్థి, యువజన సంఘాల బస్సు యాత్రకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదనీ, దానిపై కోర్టును ఆశ్రయించనున్నామన్నారు. నాడు కడపలో స్టీల్‌ ప్లాంట్‌ యాత్రకూ అనుమతివ్వకపోతే, కోర్టుకు వెళ్లి అనుమతి పొందిన విషయాన్ని గుర్తుచేశారు. జీవో`1పై హైకోర్టులో కేసు వేయగా, దానిని సస్పెండ్‌ చేశారన్నారు. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందనీ, దానిపైనా మనం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా సంఘాల తరపున, మిగిలిన యూనియన్లు, ప్రజా సంఘాలతో కలిసి హైకోర్టులో పిల్‌ వేయాలని నిర్ణయించామన్నారు. జీవో`1కు వ్యతిరేకంగా న్యాయపోరాటంలో సీపీఐ అగ్రభాగాన నిలిచిందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలపై రైతు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చేపట్టనున్న ఉద్యమానికి సంఫీుభావం తెలపాలన్నారు.

Check Also

సంజా ఉత్సవ్ ను అందరూ సందర్శించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *