-వేదాంత సారాన్ని నాలుగు పంక్తులలో రచించిన ప్రజా కవి యోగి వేమన..
-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య పామరులకు కూడా అర్థమయ్యే భాషలో ప్రజా కవి, సంఘ సంస్కర్త, యోగి వేమన రచించిన పద్యాలు సామాజిక చైతన్యానికి ఎంతో దోహదపడుతున్నాయని ప్రతి ఒక్కరూ వేమన పద్యాలను అవపోసన పట్టాడం ద్వారా జీవిత సత్యాలను గుర్తెరగాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
యోగి వేమన జయంతి పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ శతాబ్దంలో జన్మించిన యోగి వేమన రచించిన పద్యాలు సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు. ఆయన రచించిన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క సందేశాన్ని ఇస్తుందన్నారు. నాలుగు పంక్తులలో రచించిన పద్యంలో పూర్తి సారాశాన్ని, వివరణను, నీతిని బోదిస్తాయన్నారు. వేదాంత సారాన్ని చిన్న పద్యంలో పొందుపరచి పామరులకు అర్థమయ్యే రీతిలో ప్రబోధించి ప్రజా కవిగా ముద్ర వేసుకున్నారు. వేమన తన పద్యాల ద్వారా ఆత్మ సంస్కారాన్ని కుల సంస్కారాన్ని ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడని విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని ` అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము అంటూ ‘‘విశ్వదాభిరామ వినుర వేమ’’ పద్యాలు తెలుగు భాషలోనే కాక దాదాపు 10 ఇతర భాషలలో అనువాధించడం వేమన పద్యాల విశిష్టతను తెలియజేస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రతి రోజు ఒక వేమన పద్యాన్ని నేర్చుకుని వాటిలోని నీతిని తెలుసుకునేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు.