మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధార్ సేవల కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.అపరాజిత సింగ్ తో కలసి ప్రారంభించారు. అందిస్తున్న సేవలను కలెక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొబైల్ నంబర్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ (వేలిముద్రల నవీకరణ), డాక్యుమెంట్ అప్డేట్ వంటి సేవల నిమిత్తం జిల్లాలో పలు చోట్ల ఆధార్ అప్డేట్ శిబిరాలను ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధార్ కార్డులోని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు.
డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, బందరు ఆర్డీవో ఐ.కిషోర్, డీఎల్ డీఓ సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ ప్రసాద్ తదితరులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.
Tags machilipatnam
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …