-ఇస్కాన్ విజయవాడ టెంపుల్ లో కృష్ణాష్టమి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరవాసుల కల శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం. ఆ ఆలయాన్ని ఇస్కాన్ విజయవాడ వారితో కలిసి సమిష్టిగా నగరంలో నిర్మించేందుకు సహకారం అందిస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణలంకలోని ఇస్కాన్ విజయవాడ టెంపుల్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ నిర్వహకులు ఎంపి కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్నాధుడికి ఎంపి కేశినేని శివనాథ్ తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ జగన్నాధుడికి పంచ హారతి ఇవ్వటంతో పాటు, ఉత్సవ కృష్ణ విగ్రహానికి అభిషేకం చేశారు. అలాగే ఉంజల్ సేవలో కూడా పాల్గొన్నారు.
ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ విజయవాడ నిర్వహించిన ఉట్టి ఉత్సవ్ పోటీల్లో గెలిచిన విజేతలకు ఎంపికేశినేని శివనాథ్ బహుమతులు అందించారు. యువతుల విభాగంలో పిబి సిద్ధార్థ కాలేజీ విద్యార్ధులు మొదటి ఫ్రైజ్ అందుకోగా, యువకుల విభాగంలో సిద్ధార్థ ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు. అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో విజేతలైన చిన్నారులకు కూడా బహుమతులు అందించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలో అధ్యాత్మిక శోభ పెంచేందుకు ఇస్కాన్ విజయవాడ నిర్వహకులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఇటీవల నగరంలో జగన్నాథ రథయాత్ర ను చాలా ఘనంగా నిర్వహించారని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ నిర్మించాలనుకుంటున్న కృష్ణ మందిరం గ్లోరి ఆఫ్ ఆంధ్రా కు తనవంతు సాయం అందిస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బలరామ్ గోవింద దాస్, శ్రీకాంత్ ప్రభు, ముకుందా మాధవ దాస్, పి.ఆర్.వో శ్యామ్ సుందర్ అచ్చుత్ దాస్, టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర కార్యదర్శి గన్నే అన్న పాల్గొన్నారు.