Breaking News

వినూత్న విధానం తో ముంపు ప్రాంతాలలో వ్యవసాయ శాఖ సేవలు

-డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహార పదార్థాలు, మందుల పంపిణీ…
-తొలిసారిగా ముంపు ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించిన మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు
-తొలిరోజు నుండి 176 డ్రోన్ల వినియోగం
-115 డ్రోన్లతో లక్ష ఇరవై మూడు వేల మంది వరద బాధితులకు ఆహార పంపిణీ, ఔషధ సేవలు…
-50 డ్రోన్లతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ
-11 డ్రోన్లతో వ్యాధులు వ్యాపించకుండా నీటిలో క్రిమి, కీటకాల నిర్మూలన కోసం పిచికారి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకస్మికంగా సంభవించిన ఒక విలయం నుంచి విజయవాడ నగర ప్రజలను కాపాడేందుకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు నేతృత్వం లో విస్తృత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ముంపుకు గు గురైన ప్రాంతాలలో డ్రోన్ల సేవలు గురించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీకువచ్చారు. డ్రోన్ల పనితీరును పరిశీలించిన మంత్రి లోకేష్ వెంటనే ముంపు ప్రాంతాల లో సేవలందించాలన్న సూచనలు చేసారు .ప్రతిరోజు జెసిబిలు, ట్రాక్టర్లలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అవసరమైన ఆహారం, మంచినీరు వంటి సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు వ్యవసాయ శాఖలోని ఉన్నతాధికారుల వేక్షణలో బాధితులకు వేగంగా సేవలందిస్తున్నారు.
గత ఆగస్టు నెల చివర్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పంటలను కాపాడుకునే ఏర్పాట్లలో అనుసరించాల్సిన ప్రణాళిక పై వ్యవసాయ ఉన్నతాధికారులతో క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలకు పూర్తి స్థాయిలో నిండిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుండి నీటిని దిగువ పల్లపు ప్రాంతానికి వదిలే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలోనే విజయవాడ నగరం బుడమేరు ముంపునకు గురైంది. వెంటనే రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో తాను కూడా తన శాఖ తరపున ముంపు బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించే లక్ష్యంతో శాఖ కార్యదర్శి బుడితి రాజశేఖర్,
సంచాలకులు ఎస్. డిల్లీరావు లతో సమావేశం ఏర్పాటు చేశారు. తక్కువ సిబ్బందితో ముంపు బాధితులకు సహాయం అందించేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వారి ఇచ్చిన సూచనలు మేరకు పూర్తిస్థాయి డ్రోన్ల వినియోగంతో ఎక్కువమందికి ఆహారం, ఔషధాలు, సురక్షిత తాగునీరు అందించవచ్చని ఉన్నతాధికారులు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. ఈ ఆలోచన నచ్చిన మంత్రి పూర్తిస్థాయిలో డ్రోన్ల వినియోగానికి సంకల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచ్చె నాయుడుకి కూడా వరద బాధితులకు అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. తనకు కేటాయించిన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చడం మాత్రమే కాకుండా, ముంపు ప్రాంతాల్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఆహార, నీటి, మందుల పంపిణీకి, పారిశుధ్యం పిచికారి పనులతో సహా క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు సైతం వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో తొలిసారిగా సంపూర్ణ స్థాయిలో డ్రోన్లను వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, శాఖా పరమైన సమీక్షలలో, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం గురించి అవగాహన పెంచుకున్న మంత్రి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సాయం చేయడానికి ఇవి అద్భుతంగా దోహదపడతాయి అనే ఆలోచనతో తన శాఖ ఉన్నతాధికారులకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ సాంకేతిక నిపుణుల బృందం, డ్రోన్ కార్పొరేషన్
సమకూర్చిన పరిజ్ఞానంతో వినూత్నంగా చేసిన ప్రయోగం అపూర్వమైన సత్ఫలితాలు ఇచ్చింది. ఈ సందర్భంగా అచ్చంనాయుడు మాట్లాడుతూ మనిషి ఎప్పుడూ నిరంతర విద్యార్థిలా ఉండాలని, ప్రపంచంలో వస్తున్న మార్పులను తెలుసుకుంటూనే ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో మంత్రి వర్గానికి చెప్తారని, ఆయన కూడా నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కనుగొనే స్థాయిలో తన మంత్రి ఉండాలన్న ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడం కోసమే ఈ డ్రోన్ పరిజ్ఞానం, వినియోగిత అంశాలలో తాను చాలా విషయాలు తెలుసుకున్నానన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డ్రోన్లను ప్రకృతి వైపరీత్యాలలో బాధితులకు వివిధ రకాల సహాయం కోసం హెలికాప్టర్లకు ధీటుగా విస్తృత స్థాయిలో వినియోగించి ఎక్కువ మంది బాధితులకు తక్కువ సిబ్బందితో సరళతరంగా సేవలు అందించిన వ్యవసాయ శాఖను పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటనలో భాగంగా వారిని గన్నవరం నుండి తోడ్కొని వచ్చి, ముంపు ప్రాంతాలను, పంట పొలాలను చూపిస్తూ ప్రజలతోనూ ,రైతులతో వారిని మమేకం చేసి, నష్టం యొక్క తీవ్రతను స్పష్టముగా తెలియచేయడంలో అచ్చం నాయుడు సఫలీకృతం అయ్యారని చెప్పక తప్పదు.
అలసట లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా అధికారులు, బాధితులు, సామాజిక కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేయడం విధి నిర్వహణలో భాగంగా భావించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని ముంపు బాధితులకు తాను అందిస్తున్న సేవల ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలోని ఇతర శాఖల మంత్రులు కూడా తమ తమ శాఖల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు మార్గదర్శకులుగా నిలిచారని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంత్రి పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

Check Also

గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *