-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణా పరంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తురువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదన్నారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. సోమవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,22,664 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. 1735 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 177 మంది ధరఖాస్తు చేసుకోగా, వారితో పాటు పెండింగ్ లో ఉన్న 151 ధరఖాస్తుదారులకు 2122 మెట్రిక్ టన్నుల ఇసుక, మొత్తంగా 328 మంది ధరఖాస్తుదారులకు 3857 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామని మీనా వివరించారు.