విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణేష్ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా వాడవాడల కొలువుతీరిన గణనాథునికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకనగర్ ఉత్సవ కమిటీ వారి 5వ గణపతి నవరాత్రి మహోత్సవాలు నగరంలో హోమ్ రెన్నోవేషన్, టర్నీకీ ప్రాజెక్ట్, సివిల్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, ఎ టూ జడ్ సర్వీస్ తదితర వివిధ రకాలైన సర్వీసులు అందజేయడంలో పేరొందిన ‘సర్వీస్ ఫస్ట్’ వారి ఆధ్వర్యంలో విజయవాడ, దావు బుచ్చయ్యకాలనీ, వినాయక నగర్‌లో వైభవంగా ప్రారంభించారు. నవరాత్రుల కమిటీ ‘సర్వీస్ ఫస్ట్’ కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నవరాత్రులు ‘సర్వీస్ ఫస్ట్’ ఆధ్వర్యంలో 5వ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభించడం జరుగుందన్నారు. ఈ నవరాత్రులలో వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వీటిలో భాగంగా 7వ తేదీ ఉదయం స్వామివారి పూజ అనంతరం సాయంత్రం 6 గంటలకు క్లాసిక్ డాన్స్ నాట్య తరంగిణి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ అనూష నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం, 8వ తేదీ గణపతి హోమం, 9వ తేదీ పిల్లల డాన్స్, 10వ తేదీ పిల్లలకు గేమ్స్, 11వ తేదీ మహిళలకు గేమ్స్, 12వ తేదీ సాయిబాబా భజన కార్యక్రమం, 13వ తేదీ అమ్మవారి లలితా అష్టోత్తరం లలితా బృందం ప్రశాంతి కాలని, 14వ తేదీ అన్నదాన కార్యక్రమం, 15వ తేదీ ఉదయం ఉట్టి కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులందరు విచ్చేసి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు కోరారు. గేమ్స్‌లో పాల్గొన్న వారికి కేటగిరీల వారీగా ‘సర్వీస్ ఫస్ట్’ వారు బహుమతులు అందజేశారన్నారు. 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు లడ్డు పాట అనంతరం కనులు మెరుగు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు బ్రహ్మాండమైన ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ‘సర్వీస్ ఫస్ట్’ సర్వీసుల కొరకు 9030199777, 8886123757ను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్థానికులు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …