కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు కావలసిన అన్ని అవసరాలు గ్రామంలోనే తీర్చే ఉద్దేశ్యంతో గ్రామ గ్రామాన రైతు భరోసాకేంద్రాలు నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండలం మట్టగుంటలో లో డా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జరుపుకున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనాల ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కలిదిండి మండలంలో ఆక్వా సాగు ఎక్కువగా ఉందని,చేపల,రొయ్యల రైతులు అవసరాలు తీర్చే విధంగా రైతు భరోసాకేంద్రాలు పనిచేయ వలసి ఉంటుందని అన్నారు.ముఖ్యంగా ఈ మట్టగుంట పరిసర ప్రాంతాల్లో రొయ్యలు,పండు చేప ఎక్కువగా సాగు చేస్తారని, ఈ ప్రాంతంలో నీటిలో సెలినిటీ ఉండడమే ఇందుకు కారణమని అన్నారు.ఈ ప్రాంతంలో ఎక్కువగా చిన్న,సన్నకారు రైతులని వీరికి ప్రభుత్వం సబ్సిడీ పై ఏరియేటర్లు ఇచ్చే విధంగా ఇక్కడి అధికారులు పై అధికారులకు నివేదించాలని అన్నారు.అదే విధంగా ఫీడు,ఇతర మందులు ప్రభుత్వ పరంగా ఆర్బీకే ల ద్వారా అందించే విధంగా పై అధికారులకు నివేదిస్ .తాను కూడా దానికి అనుగుణంగా ప్రయత్నిస్తానని దాంతో రైతులకు మేలుచేసిన వారమవుతామని అన్నారు.అనంతరం వైఎస్ఆర్ యంత్రసేవ క్రింద సబ్సిడీ పై వచ్చిన స్ప్రేయర్లు ముగ్గురు రైతులకు అందించారు. గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు తిరుమాని వెంకటేశ్వర రావు ను దుస్సాలువ,పుష్పమాలలతో సత్కరించి జ్ఞాపిక ను అందించారు.
కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారిణి కృష్ణాజిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరక్టర్ సరస్వతి,పీఆర్ డీఈఈ సురేష్,తాశీల్థారు శాస్రి,, సర్పంచ్ ఆండ్రాజు రత్నమణి, బొమ్మిడి జనార్దన్, యంపీడీవోపార్థసారధి, వ్యవసాయం ఏడీ గంగాధర్, మత్యాశాఖ ఏడీ ప్రతిభ,వర్ధన్, ఏవో రమేష్, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయం సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, ఎంపీపీ అభ్యర్థి, చందన ఉమామహేశ్వరరావు,కైకలూరు ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, నాయకులు,చెన్నంశెట్టి కోదండరామాయ్య, కొల్లాటి సత్యనారాయణ,అంకెం నరసయ్య, ఆండ్రాజు దుర్గారావు, బొమ్మిడి ధనరాజు, మహాదేవ విజయబాబు,రావడి బాలు, తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, కొల్లాటి నాగరాజు, రేవు నరసింహరావు, నిమ్మల సాయిబాబు, పోకల కోటేశ్వరరావు, కోకా తాతాజీ, ఆండ్రాజు కృష్ణమూర్,, మోకా రామకృష్ణ, సాగి వాసురాజు, పడవల శ్రీనివాస్, చిట్టూరి బుజ్జి, సాన వెంకటరామారావు, తట్టిగోళ్ల నాంచారయ్య,ఇమ్మానేని లక్ష్మణరావు, దుగ్గిరాల రంగారావు, తిరుమాని రమేష్, సిరంగి జల్సారాయుడు,ముద్దం రామకృష్ణ, కోకా ఏకోనారాయణ, షేక్ చాన్ బాషా, కందుల వెంకటేశ్వరరావు,గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags kalidindi
Check Also
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను చైతన్యపరచి …