మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్ ను శుక్రవారం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత సందర్శించారు. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న స్థలం అనువైనదిగా లేకపోవడంతో లబ్దిదారుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 3వ తేదిన లేఅవుట్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. ఈ మేరకు జేసి మాధవిలత ఈ లేఅవుట్ ను పరిశీలించేందుకు రావడంతో అక్కడ నెలకున్న సమస్యలను ఆమెకు శాసనసభ్యులు వివరించారు. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ జెసి మాధవిలతను కోరారు. వీరి వెంట తహాశీల్దార్ ఆర్.వి.వి రోహిణిదేవి తదితరులు పాల్గొన్నారు.
Tags mylavaram
Check Also
గంగూరు రైతు సేవా కేంద్రం సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పెనమలూరు (గంగూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం …