మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత చెప్పారు. శుక్రవారం మైలవరం రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో జెసి మాధవిలత పాల్గొన్నారు. తొలిత రైతు భరోసా కేంద్రాన్ని జెసి మాధవిలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కర మార్గాలు తెలియజేసేందు ప్రభుత్వం ఈనెల 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ల్జాతుల ముంగిటకే వ్యవసాయ సేవలు అందించబడుతున్నాయన్నారు. రైతుల కోసం గ్రామాల్లోనే పెద్ద ఎత్తున
మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయనికి అవసరమైన విత్తనం మొదలు ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైనవి రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేస్తున్నారన్నారు. దీంతో రైతులు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్ళే పనితప్పిందన్నారు. రైతు పండించిన పంటలను కూడా కనీస మద్దతు ధరకే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ ఆర్.వి.వి రోహిణి దేవి, పలువురు వ్యవసాయ, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags mylavaram
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …