అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం వరకు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
శనివారం (09-05-26) అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదివారం (10-05-26) అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు పోలవరం జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో (2) తీవ్రవడగాలులు, అలాగే అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కోరుకొండ, రాజమహేంద్రవరం అర్బన్ & రూరల్, రాజానగరం, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా చింతూరు, మారేడుమిల్లి గుర్తేడు మండలాల్లో(13) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం కడపలో 40.8°C, నంద్యాల(జి) పాణ్యంలో 40.7°C, పోలవరం(జి) విఆర్ పురంలో 40.6°C, పల్నాడు(జి) గురజాలలో 40.5°C, కర్నూలు(జి) నగరడోన, ఎన్టీఆర్(జి) నందిగామలో 40.4°C, ఏలూరు(జి) కుక్కునూరులో 40.3°C, , ప్రకాశం(జి) కొప్పెరపాడులో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 16.2మిమీ, పల్నాడు జిల్లా చిలకలూరిపేట, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో 12మిమీ, ప్రకాశం జిల్లా ఉప్పుమాగులూరు 10.5మిమీ వర్షపాతం రికార్డైందన్నారు.
Prajavartha Online Telugu News