Breaking News

హై కోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ వీడ్కోలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
హై కోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికారు.హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హై కోర్టు మొదటి కోర్టు హాల్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నిబద్ధత కలిగిన జడ్జి అని కొనియాడారు. జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో జి.గాంధీ చౌదరి,విజయలక్ష్మీ దంపతులకు మే 28, 1964లో జన్మించారని, ప్రాథమిక విద్యాభ్యాసంను కారంచేడులో ఆపై గుంటూరులోని లొయోలా పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసి, గుంటూరులోని ఏసీ కాలేజీలో ఎల్ ఎల్ బి పూర్తి చేసి 1991లో బార్ కౌన్సిల్ లో సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. గుంటూరులోని న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ సుప్రింకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారని తెలిపారు. ఫిబ్రవరి 14, 2022న ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారన్నారు.

అనంతరం అడిషినల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ ప్రభునాథ్,బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఛైర్మన్ ధ్వారకానాథ్ రెడ్డిలు జస్టిస్ జి.రామృష్ణ ప్రసాద్ కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు.

అనంతరం జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.తన విద్యార్థి దశ నుండి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రతి దశలోనూ ఉత్తమ సలహాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈకార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,అడిషినల్ అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు న్యాయవాదులు జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు

-ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ద్వారా నిర్వహణ భాద్యతలు -ఇప్పటికే కూటమి పాలనలో 12 కేంద్రాలు ఏర్పాటు -వైద్య ఆరోగ్య శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *