విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పౌర సంబంధాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న యం. భాస్కరనారాయణకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 1993లో ఎపిపియస్సీ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఆర్‌ఓ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాధికారిగా నియమితులైన భాస్కరనారాయణ కొవ్యూరు, నర్సాపురంలో డివిజనల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నత పై 2017 సెప్టెంబర్ లో కృష్ణాజిల్లా పౌర సంబంధాధికారిగా నియమితులైయ్యారు. ప్రస్తుతం డిపిఆర్ఓగా పనిచేస్తున్న ఆయనకు విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పదోన్నతి లభించింది. సమాచార శాఖ కమీషనర్ ఉత్తర్వుల మేరకు సహాయ సంచాలకులుగా ఆయన భాధ్యతలను చేపట్టారు.
Tags vijayawada
Check Also
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రి నాదెండ్ల మనోహర్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల …