Breaking News

రైతులకు విత్తనాలను వారం రోజుల్లో పంపిణీ చేయండి… : కలెక్టరు జె. నివాస్


-ఇ-క్రాప్ నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టండి…
జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేయండి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా రైతాంగం వ్యవసాయ పనులను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అవసరమైన విత్తనాలను ప్రతీ రైతుకూ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. రైతులు చేపట్టిన పంటల ఇ-క్రాప్ నమోదు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాల పనులను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు విత్తనాలు సరఫరా, ఇ-క్రాప్ నమోదు, జగనన్న గృహనిర్మాణాలు, కోవిడ్ టీకాల ప్రక్రియ, వైయస్ఆర్ చేయూత, జీవక్రాంతి, తదితర అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టరు జె. నివాస్ విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో కలెక్టరు మాట్లాడుతూ రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని ఇప్పుడిప్పుడే వర్షాలు కూడా కురుస్తున్నాయని వ్యవసాయ పనులను చేపట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో సుమారు 24 వేల క్వింటాళ్ల నాణ్యమైన ఏపి సీడ్స్ వరివంగడాలను రైతాంగానికి పంపిణి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఇప్పటివరకూ 50 శాతం మంది రైతులు మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసారన్నారు. విజయవాడ, మైలవరం డివిజన్లలో వ్యవసాయ అధికారులు 80 శాతం పైగా వరివిత్తనాలను పంపిణీ చేసారని జిల్లా కలెక్టరు అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని రైతులకు వరివంగడాల నాణ్యత పై ఉన్న చిన్న చిన్న అపోహలను తొలగించి ఏపి సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలను అందించాలన్నారు. రైతుల ప్రతీ పంటనూ ఇ-క్రాప్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇ-క్రాప్ విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి నిశితంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో గ్రామ వ్యవసాయ విస్తరణా అధికారులకు ఇ-క్రాప్ బుకింగ్ పై శిక్షణా తరగతులు నిర్వహించి గ్రామంలోని ప్రతీ ఎకరాను ఇ-క్రాలో నమోదు చేయాలన్నారు. రైతు బయోమెట్రిక్ ను తీసుకుని పంటల వివరాలకు చెందిన రశీదును వారికి అందించాలని కలెక్టరు సూచించారు. వైయస్ఆర్ చేయూత పధకం క్రింద జిల్లాలో 25 వేలమంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో ఇప్పటికే నగదును జమ చేసామన్నారు. జమచేసిన సొమ్మును లబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జీవక్రాంతి పధకం క్రింద లబ్దిదారులకు మేకలు, గొర్రెలను అందించడంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. మేలురకమైన నాగావళి, నెల్లూరు గొర్రెపిల్లలను లబ్దిదారులకు అందించేందుకు వెటర్నరీ సహాయకులు కృషి చేయాలన్నారు. జగనన్న కాలనీల నిర్మాణాలలో జిల్లాకు చెందిన మండల తహశీల్దార్లు, యంపిడిఓలు, హౌసింగ్, సచివాలయ సిబ్బంది సమిష్టి కృషి కారణంగా లక్షమంది లబ్ధిదారులు గృహాల నిర్మాణం గ్రౌండింగ్ సాధ్యపడిందన్నారు. ఇందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగించి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. లెవెలింగ్ పనులు పూర్తయ్యి గృహ నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నచోట్ల లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను అందించాలని సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సహాయం ఇప్పటికే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులు గృహాలను నిర్మించుకునేందుకు బ్యాంకుల నుండి రుణ సహాయం అందించేందుకు డ్వాక్రా ఏపియంలు శ్రద్ధ తీసుకుని లబ్దిదారుల అకౌంట్ ఉన్న బ్యాంకుల వివరాలు సేకరించి రుణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆతర్వాత బ్యాంకులతో సమావేశం పెట్టి రుణాలు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. కాలనీలలో పెండింగ్ లో ఉన్న లెవెలింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని 45 సంవత్సరాలు థినిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచారు. వీడియోకాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవిలత, యల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, నుపూర్ అజయ్ కుమార్, జడ్ పి సిఇఓ సూర్యప్రకాష్, డియం హెచ్ ఓ డా. యం. సుహాసిని, హౌసింగ్ పిడి రామచంద్రన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *