మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు ఆర్ డివో పర్ఎస్ కె. ఖాజావలి శనివారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పధకం క్రింద బందరు డివిజనులో తొలుత పొట్లపాలెం గ్రామంలో ఫైలేట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో డ్రోణ్ పై చేయడం ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని తదుపరి చేపట్టిన గ్రౌండ్ ట్రూతింగ్ పనులు నాణ్యత ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రతి రైతుకు కొత్త ఖాతా అంటే ల్యాండ్ పార్శిల్ మాడ్యూల్ (ఎల్ పిఎం) తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే పనులు క్వాలిటి చెక్ కోసం బృందాలను ఏర్పాటు చేశామని రైతులు తమ అభ్యంతరాలను ఈ బృందాలకు తెలియజేయాలని గ్రామంలో 689 ఎకరాలు రీ సర్వే రికార్డు సిద్ధం చేసినట్లు ఆర్ డివో తెలిపారు. బందరు మండలం తహసిల్దారు డి. సునీల్ బాబు, సర్వే సిబ్బంది ఆర్ డివో వెంట ఉన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించిన ఆర్ డివో…
బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తొలుత 60 సంవత్సరాలు దాటిన వారికి తదుపరి 45 సం.ల నుండి 60 సం. మద్య వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ ఉచితంగా అందిస్తున్నదని అదే విధంగా 5 సం.లు వయస్సు లోపు పిల్లలు గల తల్లులకు కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ డివో సూచించారు.