Breaking News

Tag Archives: bengulor

ఓవర్ సీస్ ట్రావెల్ లాగ్ పుస్తకం ఆవిష్కరించిన హైకోర్టు సీనియర్ జడ్జి అను శివరమాన్

బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు హాల్ నెం-1లో ఈరోజు అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రచయిత శంకరప్ప రచించిన ఓవర్ సీస్ ట్రావెల్ లాగ్ పుస్తకాన్ని బెంగళూరు హైకోర్టు సీనియర్ జడ్జి అను శివరమాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఈ పుస్తకం ఎంతో శ్రమించి శంకరప్ప రాసారని ఇది అందరికి ఉపయోగపడుతుందని కొనియాడారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపలోకయుక్త జడ్జి బి. వీరప్ప, సీనియర్ కౌన్సెల్ టి.నానయ్య, అడ్వాకెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ …

Read More »

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తెలుగు మహోత్సవం

– ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువల అనన్య సమ్మేళనం బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సన్నిధిలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పండుగగా మారింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి 500 మందికి పైగా పాల్గొనగా, ఆహారం, సంప్రదాయాలు, జ్ఞానం మరియు సంస్కృతి కలయికగా ఈ మహోత్సవం నిలిచింది. విశేషంగా, 68 రకాల స్వీట్లు ఉన్న ఫుడ్ ఫెస్టివల్ …

Read More »

ఈజిపురాలో 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం

బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : బెంగళూరులోని ఈజిపురాలో 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం సోమవారం ప్రతిష్ఠించబడింది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహం, దీనిని తమిళనాడులోని తిరువణ్ణామలై నుండి తవ్విన 420 టన్నుల మోనోలిత్ రాయితో తయారు చేశారు. విశేషాలు: ఎత్తు: 108 అడుగులు, ప్రాణ ప్రతిష్ఠ: సోమవారం (జూన్ 2, 2025), స్థలం: ఈజిపురా, బెంగళూరు, ఏకశిలా విగ్రహం: 420 టన్నుల మోనోలిత్ రాయితో నిర్మించబడింది, తమిళనాడులోని తిరువణ్ణామలై నుండి తవ్వబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది: ఈ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2,458.84 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది..

 -రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏరోఇండియా 2025లో నాలుగు ప్రముఖ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) అవగాహన ఒప్పందాలు (MOUలు) కుదుర్చుకుందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేసిన‌ట్లే అని చెప్పారు. ఈ ఒప్పందాలు సమిష్టిగా రూ.2,458.84 కోట్ల పెట్టుబడిని సూచిస్తాయన్నారు. అంతేకాకుండా 8వేల‌కు పైగా ప్ర‌త్య‌క్షంగా, …

Read More »

వాహనాల అడ్వాన్సు అక్రమాలపై సీబీ సిఐడి విచారణ

-డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి -ఏడాది దాటిన ఇ.డి.లను సొంత శాఖలకు వెనక్కు పంపండి -ఎస్సీ కార్పొరేషన్ సీఓపీ సమావేశంలో మేరుగు నాగార్జున ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రుపాయలు అడ్వాన్సులుగా తీసుకొని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా ఈ విషయంగా సీబీ సిఐడి తో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి …

Read More »

దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే వాతావరణాన్ని నిర్మించాలి : ఉపరాష్ట్రపతి

– క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేందుకు అనువైన మార్గదర్శనం జరగాలని సూచన – ఇందుకు అనుగుణంగా మూలాల నుంచి క్రీడావ్యవస్థను బలోపేతం చేయాలి – ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేయడంలో ప్రైవేటు రంగం తమ బాధ్యతను నిర్వర్తించాలి – గ్రామీణ, సంప్రదాయ క్రీడలకు పెద్దపీట వేయాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – బెంగళూరులో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో క్రీడాసంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం …

Read More »

వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం : దేవినేని అవినాష్

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల అభ్యున్నతికి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ హెల్త్ సెంటర్ లను ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్, క్రీస్తురాజపురం నందు స్థానిక కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం కలిసి పర్యటించిన ఆయన దాదాపు 10లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు …

Read More »

మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికల మార్పునకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవ్వాలి: ఉపరాష్ట్రపతి

-సాంకేతిక సంస్థలు యువతకు అధునాతన సాంకేతికత అయిన 5జీ, కృత్రిమమేధ, రొబోటిక్స్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వాలి -ప్రపంచ డ్రోన్ హబ్ గా నిలిచే అవకాశం భారతదేశానికి ఉందన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -భారతీయ భాషల్లో భారతీయ రచయితల ద్వారా సాంకేతికతకు సంబంధించిన మరిన్ని పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది -నగరాల్లో కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి సాంకేతిక సహకారాన్ని కనుగొనాలంటూ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి పిలుపు -బెంగళూరులో పీఈఎస్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా …

Read More »

నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే… : ఉపరాష్ట్రపతి

-భాష, కళలు, ఆచార వ్యవహారాలు, పంటలు, విశ్వాసాల సమాహారమే జానపద విజ్ఞానం -జానపద సంపద లేకుండా అభివృద్ధి చెందిన భాష, సంస్కృతులు లేవన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -జానపదాన్ని గ్రామీణ భారతాన్ని వేర్వేరుగా చూడలేము -సామాజిక రుగ్మతల నిర్మూలనలో, స్వాతంత్ర్య పోరాటంలో జానదాలు పోషించిన పాత్ర మరువలేనిది -కోవిడ్ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా జానపద కళాకారుల చొరవ అభినందనీయం -జానపద విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలి -సినిమా, టీవీ, రేడియో జానపదానికి ప్రాధాన్యత పెంచాలి -జానపద కళాకారులు …

Read More »

భారతదేశం ఏనాడూ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు : ఉపరాష్ట్రపతి

– రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప, దాడులకోసం కాదని హితవు -భారతదేశం అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదగాలనేది నా ఆకాంక్ష -రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వయంఆధారిత దేశంగా నిలబెట్టేందుకు అత్యాధునిక దేశీయ సాంకేతికత తయారీ దిశగా దృష్టికేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి పిలుపు -విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా “ఏరో స్పేస్ హబ్” అభివృద్ధికి పిలుపు -మంచి ఫలితాల కోసం రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఆవశ్యకం -83 తేజస్ ఫైటర్ జెట్ ల …

Read More »